శ్యామ్ కె నాయుడు పై కేసు నమోదు,అరెస్ట్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చోట కె నాయుడు,వారి తమ్ముడు గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.టాలీవుడ్ లో వారిద్దరూ సినిమాటోగ్రాఫర్ గా ఎంత పేరు తెచ్చుకున్నారో తెలిసిందే.

 Police Complaint On Shyam K Naidu,shyam K Naidu,  Cinematographer , Cheating Cas-TeluguStop.com

చోటా కె నాయుడు తో పాటు ఆయన తమ్ముడు శ్యామ్ కె నాయుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పనిచేశారు.పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన వీరిద్దరూ కూడా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే అలాంటి వారిలో ఒకరిపై ఇప్పుడు పోలీసు కేసు నమోదు అవ్వడం,అరెస్ట్ అవ్వడం సంచలనం గా మారింది.సినీ ఆర్టిస్ట్ సాయి సుధా అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని ఆయ‌న‌పై ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో చీటింగ్ కేసు న‌మోదుచేసినట్లు తెలుస్తుంది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఫిల్మ్ ఇండస్ట్రీ లో సినిమాటోగ్రాఫర్స్ గా అన్నదమ్ములు ఇద్దరూ కూడా చాలా బిజీ గా ఉంటారు.ప్రతి సినిమా లో కూడా వీరి సినిమాటోగ్రఫీ నే హైలెట్ గా నిలుస్తూ వారికి మంచి గుర్తింపు వచ్చింది.

అలాంటిది శ్యామ్ కె నాయుడు పై ఇలా ఒక ఆర్టిస్ట్ మోసం చేసాడు అంటూ కేసు ఫైల్ చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube