అప్పుడు దివి ఇప్పుడు శ్వేత.. రెండవ వారం రచ్చ షురూ

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 మొదలై అప్పుడే వారం దాటి పోయింది.గత సీజన్ లో కంటే ఈ సీజన్‌ లో కంటెస్టెంట్స్ విషయంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది.

 Shwetha Varma Reaction On Housements In Elimination Nomination Bigg Boss 5, Bb5,-TeluguStop.com

చాలా రకాల వారు ఇందులో ఉన్నారు.మొదటి వారం మొత్తం ఉందా లేదా అన్నట్లుగా అనిపించిన శ్వేత రెండవ వారం వచ్చేప్పటికి రచ్చ రేపింది.

గత సీజన్ లో దివి గురించి మొదటి సీజన్ లో ఎవరు పట్టించుకోలేదు.ఎందుకంటే ఆమె ఆ సమయంలో ఎవరితో మాట్లాడేది కాదు.

ఆమె మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది ఆమె అభిమానులు అయ్యారు.ఇప్పుడు శ్వేత గురించి కూడా అంతా మాట్లాడుకునేలా చేసింది.

నిన్నటి వరకు శ్వేత గురించి ఎవరు మాట్లాడుకునే వారు కాదు.కాని ఇప్పుడు టాపిక్‌ మొత్తం ఆమెనే అనడంలో సందేహం లేదు.

మొత్తానికి బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో అందరు కూడా తమదైన శైలిలో జనాల్లోకి వెళ్లి పోయారు.ఇప్పటి వరకు శ్వేత గురించి ఒక క్లారిటీ రాలేదు అనుకుంటూ ఉన్న సమయంలో ఆమె మామూలు మాస్ కాదు అంటూ తాజా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.

మరీ దారుణంగా ఆమె ఎలిమినేట్ కు నామినేట్‌ చేసిన సమయంలో రచ్చ చేసింది.అందరిని కూడా ఒక సారి ఏకి పారేయడంతో ఇంటి సభ్యులు అంతా కూడా షాకులోకి వెళ్లిపోయారు.

నేటి ఎపిసోడ్ రచ్చ రచ్చగా ఉంటుంది అనేందుకు ప్రోమోనే సాక్ష్యం.ప్రతి ఒక్కరు కూడా రచ్చ రచ్చగా చేస్తున్నారు అంటూ ప్రోమోలో తెలుస్తోంది.నేడు ప్రోమో చూసిన ఏ ఒక్కరు కూడా ఎపిసోడ్‌ చూడకుండా ఉండలేరు అనడంలో సందేహం లేదు.మొత్తానికి ప్రోమోతో ఆకట్టుకున్నారు మరియు ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేస్తే సరిపోతుంది.

బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ లో ఏడుగురు ఉన్నట్లుగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube