గుండె బద్దలవుతుందంటూ శ్వేతా వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అవకాశం అలా అంటూ?

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో కొందరు మాత్రమే మంచి అవకాశాలు అందుకున్నారు.

 Shwetha Varma Heart Breaking Post On Movie Opportunities Details, Shweta Verma,-TeluguStop.com

మరికొందరు మాత్రం తమకున్న గుర్తింపునే కోల్పోయారు.అలా చాలా మందికి బిగ్ బాస్ అంతగా కలిసి రాలేదనే చెప్పగా.

అందులో ఒకరు శ్వేతా వర్మ అని చెప్పవచ్చు.

బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగు పెట్టి తన మాటలతో ఆకట్టుకున్న నటి శ్వేతా వర్మ.

ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ అమ్మాయి మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది.ఇక ఎంట్రీ లోనే తనతో పెట్టుకుంటే మాత్రం దేత్తడి పోచమ్మ గుడి అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇక ఈమె పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడి క్రేజ్ కొంతకాలం వరకే కనిపించింది.

పైగా కొన్ని అవకాశాలు అందుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్ పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.

Telugu Bigg Boss, Biggboss, Shweta Verma, Swetha Varma, Telugu, Tollywood-Movie

అలా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తనను ఎంతో ఇబ్బంది పెట్టారని చెబుతూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసుకుంది.అయితే కొద్దిసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేసింది.దీంతో అప్పటికే ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.అందులో.తన హార్ట్ బ్లీడ్ అవుతుందని తను ఎంతో బాధలో ఉన్నాను అని తెలిపింది.

తనకు ఇస్తానని చెప్పిన పాత్రను తనకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.

ఇలా జరగడం తనకు మొదటిసారి కాదని తెలిపింది.తన జీవితం మీద తనకు నమ్మకం కలగడం కోసం సోషల్ మీడియాకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటానని కూడా తెలిపింది.

ఇక ఆమె పంచుకున్న పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube