బిగ్ బాస్ హౌస్ లోకి రతినిర్వేదం శ్వేతా మీనన్..! రెమ్యూనరేషన్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!       2018-07-04   02:06:53  IST  Raghu V

బిగ్ బాస్ షో ఎంత పాపులర్ ఐయ్యిందో అందరికి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా సూపర్ హిట్. అందుకే సీజన్ 1 తో ఆపకుండా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ‘బిగ్‌బాస్’ షోకు తెలుగులో నాని, తమిళంలో కమల్‌హాసన్, కన్నడలో సుదీప్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్.

శ్వేతా మీనన్ మలయాళం ‘బిగ్‌బాస్‌’లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘రతీ నిర్వేదం’ సినిమాతో ఆమె ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇతర భాషలకంటే…మళయాళం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది సెలబ్రిటీలకే పారితోషికాలు భారీగా ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అందులోను హాట్ బ్యూటీ శ్వేతా మీనన్ కు అయితే లక్షకు పైగా అని టాక్.

ఇతర కంటెస్టెంట్స్ కు ఎలా ఉన్నాయో కూడా ఒక లుక్ వేసుకోండి.. యాంకర్‌ రంజిని హరిదాస్‌‌ రోజుకు రూ.80,000 పారితోషికంతో ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత హాస్య నటుడు అనూప్ చంద్రన్ రూ.71,000, నటి పర్ల మానే రూ.50,000 చొప్పున తీసుకుంటున్నారు. మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవ్వరికి ఇంత హై రేంజ్ లో లేదు.