ఆ విషయంలో ఐశ్వర్యా రాయ్ అస్సలు నచ్చదు : శ్వేతా బచ్చన్

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లోని సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఐశ్వర్యా రాయ్.మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశర్య సినిమాలతో పాటు ఎన్నో యాడ్స్ లో కూడా నటించి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Shweta Bachchan Sensational Comments About Aishwarya Rai, Aishwarya Rai, Shweta-TeluguStop.com

ఇరువర్ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ సినిమాతో ఐశ్వర్యారాయ్ తొలి హిట్ ను అందుకున్నారు.
నటనతో విమర్శకులను సైతం మెప్పించిన ఐశ్వర్యారాయ్ 2007 సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు.2015 సంవత్సరంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు.ఐశ్వర్య, అభిషేక్ లకు ఒక పాప కాగా ఆ పాప పేరు అరాధ్య బచ్చన్.2009 సంవత్సరంలో ఐశ్వర్యారాయ్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది.

Telugu Aishwarya Rai, Amitab, Sensational, Shweta Bachchan, Shwetabachchan-Movie

అయితే అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు.ఈ షోలో వదిన ఐశర్యారాయ్ గురించి మాట్లాడిన శ్వేతాబచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఐశ్వర్యారాయ్ స్ట్రాంగ్ ఉమెన్ అని ఫెంటాస్టిక్ మదర్‌ అని సెల్ఫ్ మేడ్ యాక్టర్ అని శ్వేతా బచ్చన్ అన్నారు.

అయితే ఒక విషయంలో మాత్రం తనకు ఐశ్వర్యారాయ్ నచ్చదని ఆమె పేర్కొన్నారు.
ఐశ్వర్యారాయ్ కాల్స్ చేసినా, మెసేజ్ లు పెట్టినా రెస్పాండ్ అవ్వదని ఆ విషయంలో ఐశ్వర్యారాయ్ తనకు అస్సలు నచ్చదని శ్వేతా బచ్చన్ పేర్కొన్నారు.

అన్న అభిషేక్ బచ్చన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడని మంచి భర్త, మంచి కొడుకు అని కానీ అన్ని విషయాలు తనకే తెలుసని అనుకుంటారని తెలిపారు.ఆ విషయంలో మాత్రం అభిషేక్ పై తనకు కోపం వస్తుందని ఆమె పేర్కొన్నారు.

శ్వేతా బచ్చన్ అన్నావదినలకు సంబంధించిన పాజిటివ్ విషయాలతో పాటు నెగటివ్ విషయాలను కూడా వెల్లడించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube