దేశంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే షట్ డౌన్ తప్పదా…  

Shut Down If Conditions Continue In This Country - Telugu Corona Virus, Death Rates Increasing, India, Lock Down, Shut Down

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం ఎంతగా సృష్టిస్తోందో పెద్దగా చెప్పనవసరం లేదు.అలాగే ప్రపంచ వ్యాప్తంగా  ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇప్పటికే  చిన్న చిన్న దేశాలు ఆర్థిక పరంగా నష్టపోవడమే గాకుండా ప్రాణ నష్టాన్ని కూడా మూటగట్టుకున్నాయి.

 Shut Down If Conditions Continue In This Country

దీంతో పలు దేశ ప్రభుత్వాలు ఇప్పటికీ లాక్ డౌన్ ని  కొనసాగిస్తున్నాయి.అంతేకాక పలువురు వైద్య నిపుణులు కరోనా వైరస్ ని అంతం చేయడం కోసం వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిరంతరం శ్రమిస్తున్నారు.

కాగా ఇటీవలే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ 4.0 పేరుతో సడలింపులు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ సడలింపులను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినప్పటి నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి.అలాగే మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

దేశంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే షట్ డౌన్ తప్పదా…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే మరి కొంతకాలం పాటు కొనసాగితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ని అరికట్టే లేమని పలువురు నిపుణులు భవిష్యత్తుని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రంగా కడుక్కొని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు.

  దీంతో గత నెలలో 40 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ ఒక్క నెలలోనే దాదాపు 75 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు కరోనా వైరస్ ఎంత వేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుందని.

దీంతో పలువురు వైద్య నిపుణులు మరియు సలహాదారులు 30 రోజులపాటు దేశవ్యాప్తంగా షట్ డౌన్ చేయాలని కేంద్రానికి సూచిస్తున్నారట.అంతేకాక కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ను కనుగొనే వరకూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో వచ్చే నెల 30వ తారీకు వరకు లాక్ డౌన్ పొడిగించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shut Down If Conditions Continue In This Country Related Telugu News,Photos/Pics,Images..

footer-test