మాస్ట్రో ప్రమోషనల్ సాంగ్ : కలర్ ఫుల్ భామలతో నితిన్ సందడి షురూ!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు.ప్రెసెంట్ నితిన్ మాస్ట్రో సినిమా చేస్తున్నాడు.

 Shuru Karo Promo Released From Nithin Maestro Movie Update, Nithin, Maestro, And-TeluguStop.com

ఈ సినిమాలో తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంటే నభా నటేష్ నితిన్ కు జోడీగా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన ‘అంధాదున్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

సెప్టెంబర్ 17న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగంగా చేస్తుంది.

ఈ సినిమాను ప్రజలకు రీచ్ అయ్యేలా చేయాలనీ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.తాజాగా మాస్ట్రో నుండి ప్రొమోషన్ సాంగ్ ప్రోమో ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘షురూ కరో’ అంటూ మాస్ట్రో టీమ్ ఈ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసింది.”మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ మాస్ట్రో”.అంటూ సాగె ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ పాటలో ఇద్దరు కలర్ ఫుల్ భామలు తమన్నా, నభా నటేష్ తో నితిన్ మంచి స్టెప్పులు వేస్తూ కనిపించాడు.ఇక ఈ సెట్ కూడా ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.అంతేకాదు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక ఈ సాంగ్ పూర్తి పాటను సెప్టెంబర్ 12 ఆదివారం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు.ఈ పాటకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.

క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube