శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు తీరతాయి Devotional Bhakthi Songs Programs     2017-10-18   22:59:10  IST  Raghu V

మనిషి జీవితంలో విజయం,అపజయం అనేవి రెండు ఉంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే మనిషి జీవితం పరుగు పందెం లాంటిది. కష్టాలు వచ్చినప్పుడు దైర్యం కోల్పోకుండా పోరాటం చేయాలి. కష్టాలను ఎదుర్కోవటానికి మానవ ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ కష్టాల నుండి బయట పడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని ఆలోచించాలి.

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు ఆ ఇంట్లో భార్య లేదా తల్లితో మీ మీద గుప్పెడు మినుములు తీసుకోని పై నుంచి కిందకు దిగదుడిపి నెల మీద ఫట్ మని కొట్టాలి. ఆలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ పని విజయవంతం అవటమే కాకుండా మంచి లాభం కూడా వస్తుంది.

అలాగే శుక్ర లేక శనివారం రోజున ఈ ఒక్క పని చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. చాలా మందికి ఎంత కష్టపడిన అనుకున్నంత లాభం రాదు. ఒకవేళ వచ్చిన అది ఎదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు శుక్ర లేక శనివారం కొన్ని నల్ల మినువులను తీసుకుని వాటిని రావి చెట్టు మొదల్లో వదిలెయ్యాలి. ఇలా వదలటం వలన కష్టాలు తీరతాయి. అయితే ఈ విధంగా ఉదయం లేదా మధ్యాహ్నం గాని చేయాలి. మనిషి ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా, నిరంతరం కష్టపడుతూ దానికి తోడు ఈ పరిష్కారాలను ఫాలో అయితే పనులు సక్రమంగా అవుతాయి.