ఎస్పీ శైలజను పెళ్లికి బలవంతంగా ఒప్పించారా.. ఏడాది అలా చేసిందంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శుభలేఖ సుధాకర్ ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా శుభలేఖ సుధాకర్ తన నటనతో సత్తా చాటడంతో పాటు విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

 Shubhalekha Sudhakar Comments About His Wife Goes Viral In Social Media Details,-TeluguStop.com

కొన్ని సినిమాలలో సీరియస్ రోల్స్ లో నటించిన శుభలేఖ సుధాకర్ మరికొన్ని సినిమాలలో కామెడీ రోల్స్ లో నటించి మెప్పించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ తాను వైజాగ్ లో పుట్టానని ముగ్గురం అన్నాదమ్ములమని నాన్న రైల్వే డిపార్టుమెంట్ లో పని చేశారని తెలిపారు.

తాను క్రికెటర్ కావాలని అనుకున్నా కాలేజీ స్థాయిలో ఎంపిక కాకపోవడంతో ఆగిపోయానని శుభలేఖ సుధాకర్ వెల్లడించారు.తనకు అమితాబ్ అంటే చాలా ఇష్టమని ఆయన సినిమాలను చూసి తాను నటన వైపు వెళ్లానని శుభలేఖ సుధాకర్ వెల్లడించారు.

సప్తపది సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని ఆ తర్వాత శుభలేఖ సినిమాలో ఛాన్స్ దక్కిందని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.

Telugu Amitab Bachchan, Jandhyala, Sp Sailaja, Sp Shailaja, Subhalekha-Movie

శుభలేఖ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఏడాదిన్నర పాటు మూవీ ఆఫర్లు రాలేదని ఆయన వెల్లడించారు.జంధ్యాల వల్ల శైలజతో తనకు పెళ్లి జరిగిందని ఆయన తెలిపారు.సినిమాల్లోకి రాకముందే 1977లో శైలజను చూశానని శుభలేఖ సుధాకర్ వెల్లడించారు.

Telugu Amitab Bachchan, Jandhyala, Sp Sailaja, Sp Shailaja, Subhalekha-Movie

శైలజను పెళ్లికి బలవంతంగా ఒప్పించారని అలా చేయడంతో పెళ్లైన ఏడాది వరకు శైలజ కోపంగా ఉందని అయితే పెళ్లైన ఏడాది తర్వాత భర్తను తన లైఫ్ లో మంచి బహుమతిగా ఇచ్చావని చెప్పిందని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.పెళ్లి తర్వాత ఏడున్నరేళ్ల పాటు తను, తన భార్య అవకాశాలు లేక ఖాళీగా ఉన్నామని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.శుభలేఖ సుధాకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube