తండ్రి సినిమా రీమేక్ లో నటిస్తున్న శృతి హసన్

కమల్‌హాసన్‌ వారసురాలిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హాసన్.నటిగా, గాయనిగా, మ్యుజీషియన్ గా మల్టీ టాలెంట్ అనిపించుకున్న శృతి తన తల్లిలానే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సైతం అందుకుంది.

 Shruti To Play The Lead In Aval Appadithan Remake, Tollywood, Kollywood, South Cinema, Simbu, Bhadri Venkatesh-TeluguStop.com

ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడు వరుసగా స్టార్ హీరోలతో జత కట్టి సినిమాలు చేసింది.తరువాత కొంత కాలం ప్రేమలో ఉండి సినిమాలు పక్కన పెట్టిన ఈ అమ్మడు మరల క్రాక్ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది.

సినిమా మీద భారీగా హోప్స్ పెట్టుకుంది.ఇందిలా ఉంటే ఇప్పుడు శృతి హసన్ తమిళంలో సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 Shruti To Play The Lead In Aval Appadithan Remake, Tollywood, Kollywood, South Cinema, Simbu, Bhadri Venkatesh-తండ్రి సినిమా రీమేక్ లో నటిస్తున్న శృతి హసన్-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన తండ్రి కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రధాన పాత్రల్లో 40 ఏళ్ల క్రితం వచ్చిన అవల్‌ అప్పాడిథాన్‌ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నది.భారతీయ చిత్రసీమలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

తాజాగా ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు తమిళ దర్శకుడు బద్రి వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో శృతిహాసన్‌ కథానాయికగా తీసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

ఒరిజినల్ లో శ్రీప్రియ పోషించిన పాత్రలో శృతి హాసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ప్రేమలో విఫలమై పురుష ద్వేషిగా మారే అమ్మాయిగా శృతిహాసన్‌ పాత్ర ఉంటుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన పాత్రలో శింబు, రజినీకాంత్ పోషించిన పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోలుగా నటించనున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube