శృతి చేస్తున్న వకీల్ సాబ్!  

Shruti Hassan To Romance Pawan In Vakeel Saab - Telugu Pawan Kalyan, Shruti Hassan, Telugu Movie News, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ మూవీలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్న పవన్, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Shruti Hassan To Romance Pawan In Vakeel Saab

ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌ ఎవరూ లేరా అనే అంశం ఆసక్తికరంగా మారింది.బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను పవన్ చేస్తున్నాడు.అయినా పవన్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్‌కు హీరోయిన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్.అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమాలో పవన్‌కు జోడీ ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.

శృతి చేస్తున్న వకీల్ సాబ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో పవన్ భార్యగా గబ్బర్‌సింగ్ బ్యూటీ శృతి హాసన్ నటించనుందట.

కాగా ఆమె పాత్ర పరిమితంగా ఉంటుందని, త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌లో శృతి హాసన్ జాయిన్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తానికి పవన్ కళ్యాణ్ రీఎంట్రీతోనే అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాలో ఎలాంటి అంశాన్ని మిస్ కాకుండా పవన్ చాలా జాగ్రత్త పడుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Hassan,telugu Movie News,vakeel Saab- Related....