స్టార్ హీరోయిన్ అయినా ఆ గర్వాన్ని ఏ మాత్రం ప్రదర్శించకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరనే సంగతి తెలిసిందే.స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న శృతిహాసన్ బాలకృష్ణ మూవీలో మెయిన్ హీరోయిన్ ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ ను కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నారు.
అయితే మెయిన్ హీరోయిన్ కు నో చెప్పినా కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించే పాత్రకు శృతి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
నటి మాత్రమే కాక సింగర్ అయిన శృతి హాసన్ వేర్వేరు కారణాల వల్ల గ్యాప్ తీసుకుంటున్నా రీఎంట్రీలో మళ్లీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో శృతి హాసన్ ముచ్చటించగా ఒక నెటిజన్ షాకింగ్ ప్రశ్న వేశాడు.అయితే నెటిజన్ కు బుద్ధి వచ్చేలా దిమ్మతిరిగే జవాబు ఇచ్చి శృతిహాసన్ అభిమానులను అవాక్కయ్యేలా చేశారు.
ఆహారం, శృంగారంలో ఏది లేకుండా మీ రోజు గడవదో చెప్పాలని నెటిజన్ శృతి హాసన్ ను ప్రశ్నించారు.
అయితే ఆ ప్రశ్నకు శృతి హాసన్ స్పందిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఏముందని ఆహారం లేకుండా మీరు జీవించడం సాధ్యమేనా.? అంటూ రివర్స్ లో ప్రశ్నించారు.

ఆహారం తినకుండా ఉంటే చనిపోతామని మీకు తెలియదని అనుకుంటానని శృతి చెప్పుకొచ్చారు.శృతి హాసన్ నెటిజన్ ప్రశ్నలను, సమాధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా శృతి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు శృతి సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న శృతి హాసన్ మరికొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.