శృతి హాసన్ బాలీవుడ్ చాలా గ్యాప్ తర్వాత  

Shruti Hassan Signed Bollywood Movie, Tollywood, Telugu Cinema, Indian Cinema, Kollywood, Krack Movie, Vakeel Saab Movie - Telugu Indian Cinema, Kollywood, Krack Movie, Shruti Hassan, Telugu Cinema, Tollywood, Vakeel Saab Movie

టాలీవుడ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హాసన్.కెరియర్ మంచి స్పీడ్ మీద ఉన్న సమయంలోనే ఈ అమ్మడు ఉన్నపళంగా సినిమాలకి గ్యాప్ ఇచ్చి రెండేళ్ల గ్యాప్ తీసుకుంది.ఈ రెండేళ్లలో చాలా మంచి అవకాశాలు కోల్పోయింది.తరువాత మరల క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.మరో వైపు పవన్ కళ్యాణ్ కి జోడీగా మూడో సారి వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుంది.జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో శృతి హాసన్ పాల్గొంటుంది.

TeluguStop.com - Shruti Hassan Signed Bollywood Movie

ఇదిలా ఉంటే ఈ అమ్మడు సౌత్ సినిమాలతో పాటు హిందీ సినిమాలలో కూడా ప్రయత్నాలు చేస్తుంది.అడపాదడపా అక్కడ కూడా మెరుస్తుంది.

ఈ ఏడాది ఓటీటీ ద్వారా ఆమె నటించిన యారా సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు లభించాయి.

TeluguStop.com - శృతి హాసన్ బాలీవుడ్ చాలా గ్యాప్ తర్వాత-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి అమ్మడు ఒకే చెప్పింది.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ఈ ఏడాది ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పానని, అదొక డిఫరెంట్ సబ్జెక్టు అని క్లారిటీ ఇచ్చింది.ఆ సినిమా షూటింగ్ కోసం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న అని పేర్కొంది.

మరో వైపు ఆమె నటించిన క్రాక్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమా హిట్ అయితే మరల తెలుగులో ఆమె కెరియర్ వేగం పుంజుకుంటుంది.

సెకండ్ ఇన్నింగ్ లో కూడా శృతి పాప గ్యాప్ లేకుండా తన టాలెంట్ తో మంచి అవకాశాలనే సొంతం చేసుకుంటుంది అనే టాక్ ఇప్పుడు సౌత్ లో వినిపిస్తుంది.

#Kollywood #Shruti Hassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు