ప్రభాస్, ప్రశాంత్ నీల్ అలాంటి వ్యక్తులు.. శృతి హాసన్ కామెంట్స్ వైరల్!

సాధారణంగా కెరీర్ లో బ్రేక్ తీసుకునే హీరోయిన్లకు సినిమా ఆఫర్లు ఎక్కువగా రావని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే శృతి హాసన్ మాత్రం బ్రేక్ తీసుకున్నా మళ్లీ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీ అవుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

 Shruti Haasan Shocking Comments About Prabhas And Prashant Neel Goes Viral,prabhas,prashant Neel,shruti Haasan,salaar,pan India Movie-TeluguStop.com

శృతి హాసన్ నటిస్తున్న సినిమాలలో ఇతర సినిమాలతో పోలిస్తే సలార్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ శృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతేడాది క్రాక్ సినిమాతో సక్సెస్ ను అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల ఫలితాల విషయంలో సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.నేను దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలను ఇష్టపడుతూ ఉంటానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

 Shruti Haasan Shocking Comments About Prabhas And Prashant Neel Goes Viral,prabhas,prashant Neel,shruti Haasan,salaar,pan India Movie-ప్రభాస్, ప్రశాంత్ నీల్ అలాంటి వ్యక్తులు.. శృతి హాసన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ మరో ప్రపంచంను సృష్టిస్తారని శృతి హాసన్ కామెంట్లు చేశారు.ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి పని చేయడం చాలా బాగుందని ఆమె కామెంట్లు చేశారు.ప్రభాస్ అద్భుతం అని శృతి హాసన్ ప్రశంసలతో ముంచెత్తారు.ప్రభాస్ తో పని చేయడం చాలా సరదాగా ఉంటుందని ఆమె తెలిపారు.ప్రశాంత్ నీల్, ప్రభాస్ గురించి శృతి హాసన్ పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో వాళ్లిద్దరి అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

శృతి కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

శృతి హాసన్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

గ్లామరస్ రోల్స్ తో పోలిస్తే అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.శృతి హాసన్ ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube