ఆ విషయంలో నేను వరస్ట్ అంటున్న శృతిహాసన్..?

సాధారణంగా హీరోయిన్లు ఎప్పుడూ ఇంటర్వ్యూలో కానీ సోషల్ మీడియాలో కానీ పాజిటివ్ విషయాలను ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.తమలో నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నా నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పుకోవడానికి హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు.

 Shruti Hassan Reveals Her Bad Driving Aspect,tollywood.sruthi Hasan,he Likes Dri-TeluguStop.com

అయితే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఒక విషయంలో తాను చాలా వరస్ట్ అని చెబుతున్నారు.తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన శృతి తన గురించి ఎవరికీ తెలియని విషయాన్ని వెల్లడించారు.

కారును డ్రైవ్ చేసే విషయంలో తను చాలా వరస్ట్ అని కారు డ్రైవింగ్ కు సంబంధించిన సీక్రెట్ ను శృతి వెల్లడించారు.ఎంతో అవసరమైతే కానీ తాను కారును డ్రైవ్ చేయనని ప్రపంచ చరిత్రలోనే తనలాంటి చెత్త డ్రైవర్ మరొకరు ఉండరని శృతి అన్నారు.

తాను రెడ్ కలర్ రేంజ్ వెలాన్ కారులో వెళ్లడాన్ని ఇష్టపడతానని సరదాగా డ్రైవ్ చేయాలంటే మాత్రం ఆ కారునే ఎంపిక చేసుకుంటానని ఆమె అన్నారు.

మరోవైపు తనకు ఎలక్ట్రిక్ కార్లు అంటే ఎంతో ఇష్టమని శృతిహాసన్ తెలిపారు.

పర్యావరణానికి మంచి జరగాలంటే ఎలక్ట్రిక్ కార్లను వాడటమే ఉత్తమమని శృతి పేర్కొన్నారు.పెటోల్, డీజిల్ కార్లు ఎలక్ట్రిక్ కార్లలో ఏ కారును ఎంపిక చేసుకుంటారని అడిగితే తాను ఎలక్ట్రిక్ కారునే ఎంపిక చేసుకుంటానని శృతి తెలిపారు.

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయని శృతి భవిష్యత్తులో కారును కొంటారేమో చూడాల్సి ఉంది.

Telugu Car, Rangerover Car, Salar, Shruti Hassan-Movie

మరోవైపు శృతి హీరోయిన్ గా వకీల్ సాబ్, సలార్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు.వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుండగా సలార్ సినిమా మాత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.2022 సంక్రాంతి పండుగకు సలార్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube