ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయంటున్న శృతి హాసన్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి, కమల్ హసన్ కూతురు శృతి హసన్.ఈ అమ్మడు తెలుగులో మంచి అవకాశాలు సొంతం చేసుకొని కెరియర్ మంచి జోష్ లో ఉన్నప్పుడు ఉన్నపళంగా సినిమాలు వదిలేసి విదేశీ ప్రేమికుడుతో చెట్టపట్టాల్ ఏసుకొని తిరగడం మొదలెట్టింది.

 Shruti Hassan Open Up Her Financial Problems, Tollywood, Bollywood, Kollywood, S-TeluguStop.com

అయితే గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేక్ అప్ చెప్పేసిన ఈ అమ్మడు మరల సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం మొదలుపెట్టింది.ప్రస్తుతం రవితేజకి జోడీగా క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు తన గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు మీడియాతో పంచుకుంది.

ప్రస్తుతం తనకూ ఆర్థిక సమస్యలు వున్నాయని శ్రుతి హాసన్ అంటుంది.

అందరిలానే నాకూ ఆర్థిక ఇబ్బందులు వున్నాయి.గతంలో తీసుకున్న లోన్లు చెల్లించాలి.

అయితే, ఎంత ఇబ్బంది వచ్చినా మా నాన్నను మాత్రం అడగను.అడిగితే ఆయన ఇస్తారు.

కానీ నా మనసు అంగీకరించదు.ఎవరి పైనా ఆధారపడి బతకకూడదన్నది నా అభిమతం అని చెప్పింది శ్రుతి.

అయితే ఈ విషయం కమల్ హసన్ అండ ఆమెకి ఉన్న కూడా ఆతని నుంచి తీసుకోవడానికి అంగీకరించకపోవడం ఆమె ఇండిపెండెంట్ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube