'బాయ్ ఫ్రెండ్'తో రచ్చ రచ్చ చేస్తున్న శృతి హాసన్!

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Shruti Haasan Eating Chicken Fried Rice With Boy Friend Shantanu Hazarik-TeluguStop.com

నటిగా కాకుండా సింగర్ గా కూడా పేరు సంపాదించుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో కూడా నటించి ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఇక నటిగానే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా శృతిహాసన్ బాగా వైరల్ గా మారింది.

మొదట్లో ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకుంది.ఆ తర్వాత మరో వ్యక్తిని ప్రేమించగా తనలో కొన్ని మార్పులు ఉండటంతో అతడిని కూడా వదులుకుంది.

ఇక మరో గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారిక అనే వ్యక్తితో గత కొన్ని రోజుల నుండి సన్నిహితంగా ఉండటంతో పాటు వీరి మధ్య ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా తమ డేటింగ్ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తోనే ఉంటూ బాగా రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ అతనితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.

గత ఏడాది ముంబై రోడ్లపై ఈ జంట రచ్చ చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

అందులో ఈ జంట కలిసి తినడంతో పాటు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.చికెన్ ఫ్రైడ్ ఆర్డర్ ను తెచ్చుకున్న ఈ జంట వంట గదిలో కూర్చొని తింటూ బాగా రచ్చ చేస్తున్నారు.అంతేకాకుండా కలిసి తినగలిగిన వాళ్ళే కలిసి ఉంటారని.ఇదో సాధారణమైన సాయంకాలమని.ఫ్రీగా ఫుడ్ దొరికిందని, తమ ఇద్దరికీ చికెన్ ఫ్రైడ్ అంటే ఇష్టమని తెలిపింది శృతిహాసన్.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube