తండ్రి ఓటమిపై స్పందించిన శృతి.. ఏమన్నారంటే..?

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని గెలిపించుకోవడంలో ఫెయిల్ కావడంతో పాటు తను కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే.కమల్ హాసన్ ఓటమిని రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఓటమితో పోలుస్తూ ఉండటం గమనార్హం.

 Shruti Hassan Comments On Kamal Hasan Defeat-TeluguStop.com

మరోవైపు సినీ తారలకు ఎన్నికల్లో ఈ మధ్య కాలంలో అదృష్టం కలిసిరావడం లేదు.ఒకప్పుడు రాజకీయాల్లో సినీతారల హవా కొనసాగినా ఇప్పుడు మాత్రం సినిమాతారలు రాజకీయాల్లో సత్తా చాటలేక చతికిలపడుతున్నారు.

కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంపై స్టార్ హీరోయిన్ శృతిహసన్ స్పందించారు.తన తండ్రిని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని శృతిహాసన్ పేర్కొన్నారు.మక్కల్ నీది మయ్యం పార్టీ గుర్తు అయితే టార్చి లైట్ ను కమల్ హాసన్ చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోను శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి కమల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

 Shruti Hassan Comments On Kamal Hasan Defeat-తండ్రి ఓటమిపై స్పందించిన శృతి.. ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కమల్ హాసన్ పై పోటీ చేసిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం.ఈమె కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థి కావడం గమనార్హం.

ఓడిపోయినా కమల్ ను ప్రశంసిస్తూ శృతిహాసన్ పోస్టులు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు శృతి తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతూ తన హవాను ఆమె కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Telugu #salaar, Kamal Hassan Defeat, Shocking Comments, Shruti Hassan-Movie

ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు.శృతిహాసన్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.కొన్నేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తూ రీఎంట్రీ ఇస్తున్నా శృతికి ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం.శృతిహాసన్ ఒక్కో సినిమాకు భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

#Shruti Hassan ##Salaar #KamalHassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు