అతని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయన్న శృతి హాసన్..?  

shruti hassan comments goes viral in social media Shruthi Hasan, Ravi Teja, Krack, London, I Miss London, Michel Corsan, Italy, Bone Daddies Restaurant - Telugu @shrutihaasan, Bone Daddies Restaurant, I Miss London, Italy, Krack, London, Michel Corsan, Ravi Teja, Shruthi Hasan, Shruti Hassan Comments Goes Viral In Social Media

కమల్ హాసన్ తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస విజయాలను అందుకుంటూ హీరోయిన్ గా శృతి హాసన్ అంతకంతకూ ఎదుగుతోంది.

TeluguStop.com - Shruti Hassan Comments Goes Viral In Social Media

ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో రవితేజకు జోడీగా క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది.అయితే పైకి నవ్వుతూ కనిపించే శృతి హాసన్ ఒక విషయంలో మాత్రం ఎంతో బాధ పడుతోందని తెలుస్తోంది.

శృతి హాసన్ గతంలో మైఖేల్ కోర్సన్ అనే విదేశీయుడితో ప్రేమలో పడింది.పలు సందర్భాల్లో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ శృతి కెమెరా కళ్లకు చిక్కింది.ఒక దశలో శృతి హాసన్ సినిమాలను నిర్లక్ష్యం చేయడానికి కూడా ప్రియుడితో డేటింగే కారణం.కోర్సన్ తో శృతి రహస్య వివాహం చేసుకుందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

TeluguStop.com - అతని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయన్న శృతి హాసన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రియుడితో ప్రేమలో ఉన్న సమయంలో శృతి ఇటలీ, ఇండియాకు తరచూ ప్రయాణాలు చేసేది.

అయితే శృతి పెళ్లి వార్తలు వైరల్ అయినా ఆమె స్నేహితులు మాత్రం శృతి ఏం చేసినా ధైర్యంగా చేస్తుందని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.

అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కాని కొన్ని కారణాల వల్ల శృతి హాసన్, మైఖేల్ విడిపోయారు.ప్రస్తుతం శృతి హాసన్ కూడా తన కెరీర్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.

అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్లు శృతిని ఇంకా బాయ్ ఫ్రెండ్ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయా.? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.

శృతి హాసన్ తాజాగా షేర్ చేసిన ఒక ఫోటోలో “ఐ మిస్ లండన్”, లండన్ లో బోన్ డాడీస్ అనే రెస్టారెంట్ కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.అకస్మాత్తుగా శృతికి ఆ రెస్టారెంట్ గుర్తుకు రావడానికి కోర్సన్ కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#Michel Corsan #I Miss London #Shruthi Hasan #ShrutiHassan #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Hassan Comments Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..