ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. నిజం చెప్పేసిన శృతి హాసన్ ..?

మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైనా మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు శృతి హాసన్.ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన శృతి హాసన్ పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా సమ్మర్ లో విడుదల కానుందని సమాచారం.

 Shruti Hassan Comments About Her Nose Surgery-tollywood-sruthihasan-krack-michal-TeluguStop.com

ఇప్పటికే వకీల్ సాబ్ టీజర్ విడుదలైన టీజర్ లో రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో వకీల్ సాబ్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించి ఆమె ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

గతేడాది ఎంతో మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోవడంతో ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారా.? అనే ప్రశ్న శృతిహాసన్ కు ఎదురైంది.ఆ ప్రశ్నకు శృతి హాసన్ సమాధానంగా ఈ ఏడాది తాను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పారు.ఆ తరువాత మరో నెటిజన్ శృతిహాసన్ ముక్కు సర్జరీ గురించి ప్రశ్నించారు.

Telugu Crack Result, Nose Surgery, Shrutihasan, Vakeel Saab-Movie

ముక్కుకు నిజంగానే సర్జరీ చేయించుకున్నారా.? అని నెటిజన్ అడగగా ఆ ప్రశ్నకు శృతి హాసన్ చాలా సంవత్సరాల క్రితమే తన ముక్కుకు సర్జరీ జరిగిందని.ఇంకా ఆ ముక్కు సర్జరీనే పట్టుకుని వేలాడటం ఆపేయాలని వెల్లడించారు.క్రాక్ సినిమా ప్రమోషన్లకు హాజరు కాకపోవడానికి అసలు కారణం చెప్పాలని కోరగా తాను షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్లే ఆ మూవీ ప్రమోషన్లకు హాజరు కాలేకపోయానని అన్నారు.

క్రాక్ సినిమా రిలీజ్ డేట్ గురించి సమాచారం లేకపోవడం వల్ల హాజరు కాలేదని పేర్కొన్నారు.అయితే క్రాక్ సినిమా ఫలితం పట్ల తాను సంతోషంగా ఉన్నానని శృతిహాసన్ అన్నారు.

ప్రియుడు మైఖేల్ ను అసహ్యించుకుంటున్నారా ? అనే ప్రశ్నకు తాను ఎవరినీ అసహ్యించుకోను కాబట్టి ఆ ప్రశ్నకు లేదనే సమాధానం వస్తుందని.అయితే కొంచెం బాధ పడతానని శృతి హాసన్ వెల్లడించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube