హీరోలకు అదృష్టదేవతలా మారుతున్న శృతిహాసన్..?  

సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శృతిహాసన్.ఈ సినిమాకు ముందే బాలీవుడ్ లో లక్ సినిమాతో శృతి ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

TeluguStop.com - Shruti Hassan Becomes Golden Leg For Tollywood Star Heroes

తమిళంలో శృతి నటించిన 3 సినిమా కూడా డిజాస్టర్ అయింది.అలా కెరీర్ మొదట్లో శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో శృతిహాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శృతికి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కింది.తాజాగా క్రాక్ సినిమాతో శృతిహాసన్ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

TeluguStop.com - హీరోలకు అదృష్టదేవతలా మారుతున్న శృతిహాసన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే శృతిహాసన్ ఫ్యాన్స్ అప్పట్లో శృతిహాసన్ ను అందరూ ఐరన్ లెగ్ అనేవారని ఇప్పుడు మాత్రం ఆమె గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటోందని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

Telugu Krack, Lucky Heroine, Shrimanthudu, Shruti Hassa, Tollywood Heroine-Movie

క్రాక్ సినిమాకు ముందు రవితేజ హీరోగా నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయని.శృతి హాసన్ నటించిన క్రాక్ సినిమా మాత్రం హిట్ అయిందని శృతి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.గతంలో 1 నేనొక్కడినే, ఆగడు డిజాస్టర్ల తరువాత శృతిహాసన్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు.

భవిష్యత్తులో కూడా శృతిహాసన్ నటించబోయే సినిమాలు ఫ్లాప్ హీరోలకు హిట్లు ఇస్తే మాత్రం శృతిహాసన్ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ శృతిహాసన్ జంటగా నటించిన వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు శృతి చేతిలో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు ఉన్నాయి.

#Krack #Lucky Heroine #Shrimanthudu #Shruti Hassa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు