గ్రాండ్ సక్సెస్ తో రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్...మళ్ళీ రేస్ లోకి  

కమల్ హాసన్ కూతురుగా సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ శృతి హాసన్.నటిగా బాలీవుడ్ లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ అనుకున్న స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకోలేకపోయింది.

TeluguStop.com - Shruti Hassan Again Came To Star Heroine Race

తరువాత తెలుగులో అనగనగా ఒక ధీరుడు సినిమాతో అరంగేట్రం చేసింది.ఈ సినిమాతో నటిగా మంచి మార్కులువేయించుకున్న హిట్ మాత్రం సొంతం చేసుకోలేదు.

తరువాత తెలుగు, తమిళ్ బాషలలో సినిమాలు చేసిన హిట్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.

TeluguStop.com - గ్రాండ్ సక్సెస్ తో రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్…మళ్ళీ రేస్ లోకి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కోసం శృతి హాసన్ ని తీసుకున్నారు.ఆ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అలాగే పవన్ కళ్యాణ్ కి చాలా గ్యాప్ తర్వాత పవర్ ఫుల్ హిట్ వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు వచ్చాయి.

చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యింది.దీంతో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా రేస్ లోకి వచ్చింది.

కమర్షియల్ సినిమాలలో స్టార్ హీరోలతో జత కడుతూవస్తున్నా శృతి హాసన్ ఉన్నట్టుండి గ్యాప్ తీసుకుంది.సినిమాలు పక్కన పెట్టి రెండేళ్లు మ్యూజిక్ కాన్సెర్ట్స్ అంటూ, బాయ్ ఫ్రెండ్ అంటూ టైం వేస్ట్ చేసుకుంది.

రెండేళ్ల తర్వాత మరల సినిమాలు ఒప్పుకోవడం స్టార్ట్ చేసింది.అయితే ఈ రెండేళ్ల గ్యాప్ లో కీర్తి సురేష్, రష్మిక మందన, పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేశారు.దీంతో శృతి హాసన్ కి మళ్ళీ స్టార్ హీరోయిన్ రేంజ్ రావడం కష్టం అని అందరూ భావించారు.అయితే తాజాగా క్రాక్ సినిమాతో మళ్ళీ కమర్షియల్ సక్సెస్ అందుకొని తనకున్న గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ ని కొనసాగించింది.

రవితేజకి వరుస మూడు ఫ్లాప్ ల తర్వాత మరల క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ వచ్చింది.దీంతో శృతి హాసన్ మళ్ళీ స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చినట్లే అనే టాక్ వినిపిస్తుంది.

వకీల్ సాబ్ కూడా హిట్ అయితే శృతి రేంజ్ మారిపోతుందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

#Raviteja #Shruti Hassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Hassan Again Came To Star Heroine Race Related Telugu News,Photos/Pics,Images..