పెళ్లిపై ఆసక్తి లేదు.. లివింగ్ రిలేషన్ బాగుంది.. శృతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ హీరోయిన్లలో ఒకరైనశృతిహాసన్ సలార్ సినిమాతో పాటు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీలో నటిస్తున్నారు.తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా శృతికి వరుసగా ఆఫర్లు వస్తుండగా శృతి హాసన్ నచ్చిన ఆఫర్లకు ఓకే చెబుతున్నారు.

 Shruti Hassan About Living Relationship Details Here , Shruti Hassan , Tollywood-TeluguStop.com

ప్రస్తుతం శంతను హజారికతో శృతిహాసన్ డేటింగ్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.శృతి హాసన్ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించారు.

ముంబైలో శృతి, శంతను ఒకే ఇంట్లో ఉంటున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలోశృతి హాసన్ కు పెళ్లికి సంబంధించి ప్రశ్న ఎదురైంది.

శృతి హాసన్ ఆ ప్రశ్నకు స్పందిస్తూ తన దగ్గర పెళ్లి ప్రస్తావనను తీసుకొనిరావద్దని పెళ్లీ లేదు గిళ్లీ లేదని కామెంట్లు చేశారు.శృతి హాసన్ ఈ విధంగా కామెంట్లు చేయడంతో లివింగ్ రిలేషన్ లోనేఆమె సంతోషంగా ఉన్నారని పెళ్లిపై శృతి హాసన్ కు ఏ మాత్రం ఆసక్తి లేదని అర్థమవుతోంది.

సోషల్ మీడియా వేదికగా శృతి హాసన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతుండగా శృతిని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం బిజీగా ఉన్న శృతి హాసన్ ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.శంతను అంటే శృతి హాసన్ కు ఎంతో ఇష్టం కాగా శంతను ఉంటే సంతోషంగా ఉంటానని శృతి హాసన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.శృతి హాసన్ శంతనుకు తమిళ వంటకాలను సైతం పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

శృతి హాసన్ గతంలో మేఖేల్ కోర్సల్ అనే వ్యక్తితో డేటింగ్ చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తితో శృతి హాసన్ విడిపోయారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శృతి హాసన్ పెళ్లి గురించి ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

Shruti Haasan Shocking Comments on Marriage Shruti haasan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube