టాలీవుడ్ స్టార్ హీరోలపై సెటైర్లు వేసిన శృతి హాసన్!  

shruti hasan sensational comments on tollywood star heroes Sruthi Hasan, Evadu, Gabbar Singh, Chiranjeevi, Rajamouli, Venkatesh, Ravi Teja, Krack, - Telugu Chiranjeevi, Evadu, Gabbar Singh, Krack, Rajamouli, Ravi Teja, Sruthi Hasan, Venkatesh

హిందీ సినిమా లక్ తో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

TeluguStop.com - Shruti Hasan Sensational Comments On Tollywood Star Heroes

గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు, ఎవడు సినిమాలు హీరోయిన్ గా శృతి హాసన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

రవితేజకు జోడీగా గతంలో బలుపు సినిమాలో నటించిన శృతిహాసన్ ప్రస్తుతం రవితేజతో క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది.

TeluguStop.com - టాలీవుడ్ స్టార్ హీరోలపై సెటైర్లు వేసిన శృతి హాసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కమల్ హాసన్ కూతురు కావడంతో ఇండస్ట్రీలో అవకాశాలు సులువుగానే వచ్చినా తన ప్రతిభతో సినిమా సినిమాకు పరిణతి చూపిస్తూ శృతి హాసన్ మంచి నటిగా ఎదిగింది.లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది.

నెటిజన్లతో శృతి ముచ్చటిస్తూ తనకు ఒంటరితనం ఇష్టమని, ఇంట్లో ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని పేర్కొంది.గడిచిన కొన్నేళ్ల నుంచి తాను ఒంటరిగానే ఉంటున్నానని ఇంట్లో అన్ని పనులు ఒక్కదానినే చేసుకుంటానని ఇతరులపై ఆధారపడటం తనకు నచ్చదని శృతిహాసన్ తెలిపింది.

లాక్ డౌన్ టైమ్ లో వంట పాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా.? అని కొందరు సవాల్ విసిరారని.అలాంటి పనులు చేసుకోవడం మన బాధ్యత అని కామెంట్లు చేసింది.

బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ పేరుతో లాక్ డౌన్ సమయంలో చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు ఛాలెంజ్ నిర్వహించగా శృతిహాసన్ వారిపై పరోక్షంగా సెటైర్లు వేయడం గమనార్హం.

ఈ ఛాలెంజ్ లో చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్ పాల్గొన్నారు.

#Gabbar Singh #Krack #Venkatesh #Sruthi Hasan #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Hasan Sensational Comments On Tollywood Star Heroes Related Telugu News,Photos/Pics,Images..