బాయ్ ఫ్రెండ్ గురించి .. పిల్లల్ని కనడం గురించి మొత్తం బయటపెట్టింది శృతి

అందాలతార శృతి హాసన్ ప్రస్తుతం జిమ్ లో గంటలు గంటలు గడుపుతోంది.కాటమరాయుడు సినిమాలో తన ఫిగర్ పై తీవ్ర విమర్శలు రావడంతో బరువు తగ్గే పనిలో పడింది.

 Shruti Haasan Wants To Make Babies Before Marriage With The Right Guy-TeluguStop.com

బరువు పెరిగినంత మాత్రానా తానేం అందవిహీనంగా తాయారవ్వలేదని, తానేంటో తన తదుపరి సినిమాలతో చూపిస్తానని చెప్పింది.

ఇదిలా ఉంటే శృతి బాయ్ ఫ్రెండ్ మీద మీడియాలో బాగా చర్చలు జరుగుతున్నాయి.

లండన్ కి చెందిన మైకెల్ కొర్సాలేతో శృతి చనువు చూసి ఇతడే శృతి కొత్త బాయ్ ఫ్రెండ్ అని తేల్చిపారేసారు జనాలు.కమల్ హాసన్ కూడా శృతి ఫ్రెండ్ ని కలవడం, శృతి – మైకెల్ తరుచుగా కలిసి కనిపిస్తుండటం, మొన్న జరిగిన క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా శృతి కోసం మైకెల్ వెళ్ళడంతో, ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని అనిపిస్తున్నా, అలాంటిదేమి లేదన్నట్లుగా మాట్లాడుతోంది శృతి.

“నేను ఒకప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో పడ్డానని ఇదివరకే చెప్పాను.నిజానికి అది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ అని బ్రేకప్ తరువాత అర్థం చేసుకున్నాను.

మరోసారి అలాంటి తప్పు చేయను.ప్రస్తుతానికి నా జీవితంలో ఎవరు లేరు.

కాని సరైనవాడు తగిలితే నేనే చెప్తాను.నాకు అతని మీద నమ్మకం కలిగితే, పెళ్ళికి ముందే పిల్లల్ని కంటాను.

నా గురించి ప్రపంచం ఏం మాట్లాడుకున్నా నాకు అనవసరం” అంటూ చాలా బోల్డ్ స్టెట్‌మెంట్ ఇచ్చింది శృతి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube