తన బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసిన శృతిహాసన్

కమల్ హాసన్ గారాలపట్టి శృతిహాసన్ టైమ్ బాగా నడుస్తోంది.తెలుగులో శ్రీమంతుడు లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం హిందీ,తెలుగు,తమిళ చిత్రాలతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కమల్ హాసన్ నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రంలో కనిపించనుంది.

 Shruti Haasan Speaks About Her Ex Boyfriend-TeluguStop.com

ఇక ప్రొఫేషనల్ లైఫ్ కాసేపు పక్కనపెట్టి, కొంచెం పర్సనల్ లైఫ్ లోకి వెళితే ….

మనకు తెలిసిన విషయమే, శృతిహాసన్ ఏదైనా సూటిగా మాట్లాడుతుంది.

దాపరికాలు, దాటివేతలు శృతి దగ్గర కనబడవు.అందుకే తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేసింది.పేరు బయటకు తీయలేదు కాని, కెరీర్ మొదట్లో శృతి ఒక సంగీత దర్శకుడితో ప్రేమలో పడిందట.

“తనొక జెంటిల్ మన్, ప్రతిభావంతుడు కూడా.సాధారణంగా తమ బాయ్ ఫ్రెండ్స్ గురించి పబ్లిక్ లో చెప్పరు హీరోయిన్లు.కాని నేను అలా కాదు” అంటూ ఒకప్పటి ప్రేమ విషయాన్ని ఇటివలే బయటపెట్టింది మన చారుశీల.

అంటే శృతి ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేదన్నమాట.అలాగే ఒకప్పుడు సిద్ధార్థ్ తో ప్రేమలో పడిందని, ధనుష్ తో ప్రేమలో పడిందని వచ్చిన వార్తలు కూడా రూమర్లే అన్నమాట.

అవే నిజమైతే శృతి ఈపాటికే చెప్పేసేదేమో!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube