'లాక్ డౌన్'లో బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేస్తున్న శృతి హాసన్..?

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నటిగా కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Shruti Haasan Shares Lockdown Post Boyfriend Santanu Hazarika-TeluguStop.com

పలు సినిమాల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Shruti Haasan Shares Lockdown Post Boyfriend Santanu Hazarika-లాక్ డౌన్’లో బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేస్తున్న శృతి హాసన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే శృతిహాసన్ ముంబైకి చెందిన గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో గత కొన్ని రోజుల నుండి ప్రేమాయణం చేస్తున్నట్లు వార్తలు వినిపించగా.

ఆమె సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి షేర్ చేసే ఫోటోలను చూస్తే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రేమ అనే అర్థమవుతుంది.ఇటీవల తమ డేటింగ్ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చిన ఈ బ్యూటీ.

ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బాగా రచ్చ చేస్తుంది శృతిహాసన్.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

అందులో శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతాను తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.అందులో అతడి బుగ్గ గిల్లుతూ, కాస్త రచ్చ చేసినట్లు అనిపిస్తుంది.

ఈ ఫోటోలకు ‘బెస్టీతో లాక్ డౌన్’అంటూ షేర్ చేసింది.అంతేకాకుండా గత ఏడాది శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా శాంతను పెట్టిన పోస్టులు వైరల్ కాగా.

అందులో ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా తెగ రచ్చ చేశారు.ఇక ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజనులు రక రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ సమయంలో ఇలా షేర్ చేయడం అవసరమా అంటూ.సహాయం చేయడానికైనా ముందుకు రండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

#Shruthi Hasan #Lockdwon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు