లెస్బియన్ పాత్రలో శృతి మించి నటించిన శృతి హాసన్  

Shruti Haasan plays lesbian in Pitta Kathalu, Tollywood, Telugu Cinema, Digital Entertainment- Netflix- Krack Movie-pittakathalu-lasbian-web series-sruthihasan - Telugu Digital Entertainment, Krack Movie, Netflix, Pitta Kathalu, Shruti Haasan, Telugu Cinema, Tollywood

కమల్ హాసన్ కూతురు అనే ట్యాగ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతి హాసన్.మల్టీ టాలెంటెడ్ అయిన శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

TeluguStop.com - Shruti Haasan Plays Lesbian In Pitta Kathalu

దీంతో ఆమె మీద ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో కెరియర్ లో ఫస్ట్ హిట్ కొట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ తో స్టార్ హీరోలకి జోడీగా మారిపోయింది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.అయితే కాటమరాయుడు సినిమా తర్వాత హీరోయిన్ గా రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరల క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది.

TeluguStop.com - లెస్బియన్ పాత్రలో శృతి మించి నటించిన శృతి హాసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తండ్రిలానే నటిగా విభిన్న పాత్రలు చేయడానికి శ్రుతి హసన్ ఇష్టపడుతుంది.తెలుగులో ఇప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్ పాత్రలే శ్రుతి హసన్ చేస్తూ వస్తున్న బాలీవుడ్ లో మాత్రం నటిగా ప్రూవ్ చేసుకునే విభిన్నమైన రోల్స్ చేసే అవకాశం దక్కించుకుంటుంది.

ఈ అమ్మడు ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఇండియన్ హీరోయిన్స్ ఎక్కువగా లెస్బియన్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు.

అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఆలోచన మారుతుంది.నటనకి ప్రాధాన్యత ఉన్న భిన్నమైన పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

అ సినిమాలో నిత్యామీనన్ మగాడి లక్షణాలు ఉన్న అమ్మాయిగా నటించింది, నిత్యా మీనన్ ని ప్రేమించే అమ్మాయి పాత్రలో ఇషా రెబ్బ లెస్బియన్ గా నటించింది.అయితే అందులో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేవు.

ఈ మధ్య తమిళంలో గౌతమ్ మీనన్ నిర్మించిన వెబ్ సిరీస్ లో హీరోయిన్ అంజలి లెస్బియన్ గా నటించింది.ఈమె ఏకంగా బాలీవుడ్ నటి కల్కీ కొచ్చిన్ తో రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ కూడా చేసింది.

ఇప్పుడు లస్ట్ స్టోరీస్ నెట్ ఫ్లిక్స్ తెలుగులో రీమేక్ చేసింది.నాలుగు కథలతో అంతాలాజీగా నడిచే ఈ వెబ్ సిరీస్ లో ఒక్కో కథని ఒక్కో దర్శకుడు తెరకెక్కించాడు.

పిట్టకథలు టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ఓ స్టొరీలో శ్రుతి హసన్ మెయిన్ లీడ్ చేసింది.ఇందులో ఆమెది లెస్బియన్ పాత్ర కావడం విశేషం.

ఇక మరో అమ్మాయి ప్రేమించే అమ్మాయిగా శ్రుతి హసన్ నటించడంతో భీభత్సమైన రొమాంటిక్ సన్నివేశాలని కూడా తన సహనటితో చేసింది.ఈ పిట్టకథలు టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ టీజర్ చూసిన వారు తెలుగు దర్శకులు కూడా భాగానే అప్డేట్ అయ్యారని చెప్పుకుంటున్నారు.

.

#Shruti Haasan #Netflix #Pitta Kathalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు