తండ్రి రాజకీయాలకి తాను దూరం అంటున్న శృతి హాసన్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా, గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హాసన్.తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

 Shruti Haasan Not Interested Election Campaign For Kamal, Kollywood, Krack Movie-TeluguStop.com

ప్రస్తుతం ఈ భామ తెలుగులో వకీల్ సాబ్, క్రాక్ సినిమాలతో పాటు తమిళంలో లాభమ్ సినిమాలో నటిస్తుంది.ఈ మూడు సినిమాలు మళ్ళీ లాక్ డౌన్ తర్వాత సెట్స్ పైకి వెళ్లాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ చెన్నైలో లాభమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.ఈ నేపధ్యంలో మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సందర్భంగా సినిమాల గురించి చెప్పడంతో పాటు తన తండ్రి రాజకీయ ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది.

తన ప్రయాణం సినిమాలలోనే సాగుతుందని స్పష్టం చేసిన శృతి హాసన్ తనకి రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని క్లారిటీ ఇచ్చింది.

ఏదో టైమ్‌పాస్‌ కోసం ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదని, తన తండ్రి కమల్‌కు ప్రజలకు ఏదో మంచి చేయాలనే తపన అధికంగా ఉందని చెప్పారు.ఈ ఎన్నికలలో కమల్‌ పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తాను ప్రచారం చేయనని ఆమె స్పష్టం చేశారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకి కమల్ హాసన్ ఎమ్ఎన్ఎమ్ పార్టీ సిద్ధమవుతోంది.నియోజకవర్గాల వారీగా అభ్యర్థులని ఖరారు చేసే పనిలో ఉన్నారు.ఈ నేపధ్యంలో తన తండ్రికి రాజకీయంగా తాను ఎలాంటి సహకారం అందించనని శృతి హాసన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.సినిమాల వరకు తండ్రి వారసత్వం తీసుకున్న రాజకీయాలకి మాత్రం తండ్రి వారసత్వం తీసుకోలేనని శృతి హాసన్ తెగేసి చెప్పడం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube