శృతి ఆ వాసనంటే పడిచస్తోందట

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ శృతి హాసన్, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా మారి అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది.

 Shruti Haasan, Cigarette Smell, Raviteja, Krack-TeluguStop.com

అయితే తన వ్యక్తిగత జీవితం కారణంగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు మళ్లీ తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతోంది.

అయితే ఆమెకు ఉన్న అలవాట్లలో కొన్నింటి గురించి ప్రస్తావించిన శృతి హాసన్, అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

తనకు సిగరెట్ వాసన అంటే చాలా ఇష్టమని, దాంతో పాటు చాక్లెట్, పెన్సిల్ వాసన కూడా బాగా నచ్చుతుందని ఆమె చెప్పుకొచ్చింది.అయితే ఇతరులు సిగరెట్ తాగితే ఆమెకు నచ్చదని చెప్పుకొచ్చింది.

ఒక స్టార్ హీరోయిన్‌కు సిగరెట్ వాసన నచ్చడమేమిటి అంటూ పలవురు ముక్కున వేలేసుకుంటున్నారు.

కాగా ప్రస్తుతం మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్‌లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

దీంతో పాటు పవన్ కళ్యాణ్ సరసన కూడా ఓ సినిమాలో నటించేందుకు శృతి హాసన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube