ఆ రోజు ఏమైపోతానో అని భయపడ్డ శృతి హాసన్?

సినీ నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Shruti Haasan Is Afraid Of What Will Happen The Day-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలలో కూడా నటించింది.నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఈమధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది శృతిహాసన్.ఇదిలా ఉంటే తన జీవితంలో ఓ రోజు గురించి బయటకు చెప్పుకుంది.

 Shruti Haasan Is Afraid Of What Will Happen The Day-ఆ రోజు ఏమైపోతానో అని భయపడ్డ శృతి హాసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయమయ్యింది.ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.కెరీర్ మొదట్లో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది.ఇదిలా ఉంటే తాను నటించిన మొదటి సినిమా ‘లక్’ విడుదలై ఇటీవలే పన్నెండేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.పన్నెండేళ్ల క్రితం ఈరోజు తనేంటో.తను ఏమవుతానో.ఏం సాధిస్తానో కూడా తెలియని పరిస్థితి అని తెలిపింది.ఇష్టపడిన పనిని చేయాలని, ప్రతిరోజు గొప్పగా ఉండాలని బాగా తపన పడేదట.ఇక ఇప్పటికి తను అదే పద్ధతిలో ఉన్నానంటూ, ఎత్తు పల్లాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొత్త జర్నీ లా భావిస్తానని అనుకుంటుందట.

తన సక్సెస్ లో ప్రేక్షకుల పాత్ర చాలా ముఖ్యమైనదని.ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపింది శృతిహాసన్.

ఇక శృతి హాసన్ గతంలో తన వ్యక్తిగత విషయం పట్ల సినిమాలకు దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.ఇక ప్రస్తుతం తమిళంలో లాభం అనే సినిమాలో నటిస్తుంది.ఇక తెలుగులో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#ShrutiHaasan #Shruthi Haasan #ActressShruti #ShrutiHaasan #ActressShruti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు