అలాంటి అబ్బాయిలను ఇష్టపడతానంటున్న శృతిహాసన్!

దాదాపు పదేళ్ల క్రితం హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించిన శృతిహాసన్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.వేర్వేరు కారణాల వల్ల మధ్యలో గ్యాప్ తీసుకుంటున్న శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో క్రాక్, వకీల్ సాబ్ సినిమాల్లో నటిస్తున్నారు.

 Shruti Haasan Interesting Comments About Boys, Beard, Boys, Interesting Comment-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు ఇస్తున్న శృతిహాసన్ ఆ ఇంటర్వ్యూల్లో పలు కీలక విషయాలను వెల్లడిస్తూ తన జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.

తెలుగులో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలతో నటించిన శృతిహాసన్ తాను ప్రభాస్ తో మాత్రం నటించలేదని తెలిపారు.

ప్రభాస్ తో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.అయ్యో అనే పదం తనకు ఊతపదమని ఆ పదాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటానని శృతిహాసన్ వెల్లడించారు.

లండన్ లోని బోన్ డాడీస్ రెస్టారెంట్ తనకు ఇష్టమైన రెస్టారెంట్ అని.ఇల్లు తనకు ఫేవరేట్ హ్యాంగౌట్ ప్లేస్ అని శృతిహాసన్ వెల్లడించారు.

Telugu Beard, Shruti Hassan-Movie

ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ ఈ విషయాలను వెల్లడించారు.తనకు గడ్డంతో ఉన్న అబ్బాయిలు ఎక్కువగా నచ్చుతారని అయితే ప్రస్తుతానికి మాత్రం తాను సింగిల్ అని శృతిహాసన్ తెలిపారు.ఇతర హీరోయిన్లలో తమన్నా అంటే చాలా ఇష్టమని తమన్నా చాలా అందంగా ఉంటుందని శృతి తెలిపారు.డేటింగ్ గురించి ప్రశ్న ఎదురు కాగా తాను ఎవరితో డేటింగ్ లో లేనని శృతి అన్నారు.

లైఫ్ లో తండ్రి కమల్ హాసన్ తనకు స్పూర్తి అని.ఫిట్ నెస్ విషయంలో హాలీవుడ్ బ్యూటీ హాలీ బెర్రీ అంటే తనకు ఇష్టమని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలే కాక కొత్త సినిమా ఆఫర్లు కూడా శృతికి వస్తున్నాయని తెలుస్తోంది.అయితే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే శృతిహాసన్ ఎంచుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube