సెట్స్‌లో డైరెక్టర్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్న శ్రుతి హాసన్.. అసలు విషయం?

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి శృతిహాసన్.ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనా… తదనంతరం తన నటనా ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్నారు ఈ అందాల నటి శృతిహాసన్.

 Shruti Haasan Enjoys Annoying Director Prashanth Neel On Sets Of Prabhas Salaar-TeluguStop.com

బాల్యనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈమె… అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు.హీరో సిద్దార్థ్ తో నటించిన ఈ సినిమా అంతగా విజయాన్ని సాధించి పెట్టనప్పటికీ… ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో… దక్షిణ భారత ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు శ్రుతి.

శ్రుతి హసన్ కెరీర్ అత్యంత భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జత కట్టిన ‘ గబ్బర్ సింగ్ ‘.ఈ సినిమా బాక్స్ ఆఫీసును షేక్ చేసి, కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చింది.

 Shruti Haasan Enjoys Annoying Director Prashanth Neel On Sets Of Prabhas Salaar-సెట్స్‌లో డైరెక్టర్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్న శ్రుతి హాసన్.. అసలు విషయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత తీసిన బలుపు, రామయ్య వస్తావయ్యా లాంటి మూవీలు చేసిన శ్రుతి… ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు.ఈ మధ్య కాలంలో హీరో రవితేజతో తీసిన క్రాక్ సినిమా అన్ని తరాల ప్రేక్షకులకు నచ్చి… మరోసారి తన టాలెంట్ ను చూపించారు శ్రుతి హసన్.

ఇక ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో గడుపుతున్న శ్రుతి….పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నారు.

అదే ‘సలార్ ‘.ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే త్రీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్… ప్రస్తుతం ఫోర్త్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

క్రమంలో శ్రుతి సెట్స్ లో చిత్ర బృందంతో కలసి తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫేవరేట్ యాక్ట్ ఏంటో రివీల్ చేసింది.తనకు ఇష్టమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ఇబ్బంది పెట్టడమే తన హాబీ అంటూ… ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Prabhas #ShruthiHaasan #Pan India #ShruthiHaasan #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు