కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ బాలివుడ్ పై మక్కువ పెంచుకుంది.అమ్మడుకి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు మెండుగా ఉన్నా ఎక్కడో చిన్న అసంతృప్తి శృతిని వెంటాడుతూనే ఉంది.
నిజానికి శృతి తన కెరీర్ పట్ల పూర్తి సంతృప్తిగా లేదంట.
తమిళ అగ్రహీరోకి ముద్దుల కూతురు అయినా, తన మొదటి సినిమా బాలివుడ్ లోనే చేసింది శృతి.
ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ సరసన చేసిన “లక్” శృతి మొదటి సినిమా.కాని ఆ చిత్రం శృతి లక్ మార్చలేకపోయింది.
బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా, సక్సెస్ లేక బాలివుడ్ లో అగ్రకథానాయికగా ఎదగలేకపోయింది.
ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నా, అవేవి అంత ఆసక్తికరంగా లేవు.
ఈ విషయంపై శృతి తన సన్నిహితుల దగ్గర తెగ బాధపడుతోందట.
దక్షిణాదిలో అగ్రకథానయికగా ఎదిగినా, బాలివుడ్ లో అంతగా పట్టించుకోకపోవడం శృతిని తీవ్రంగా కలచివేస్తోంది.మరి శృతి తలరాత ఎప్పుడు మారుతుందో!
.