సలార్ లో నాపై అలాంటి సీన్స్ లేవు.. కన్ఫర్మ్ చేసిన శృతి!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్.బాహుబలి చిత్రం ద్వారా తన స్టామినా పెంచుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పైన నిలబెట్టాడు.

 Shruti Haasan Comments On His Character In Salaar Movie-TeluguStop.com

ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
రాధే శ్యామ్ పూర్తికాక ముందే నాగ్ అశ్విన్ తో ఒక సినిమాను ఒప్పుకున్నాడు.అంతేకాదు ఆదిపురుష్ అనే సినిమా కూడా కమిట్ అయ్యాడు.ఇప్పుడు సలార్ సినిమా చేస్తున్నాడు.అన్ని సినిమాల కన్నా లేటుగా ప్రకటించిన ఈ సినిమానే ప్రభాస్ ముందుగా స్టార్ట్ చేసాడు.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

 Shruti Haasan Comments On His Character In Salaar Movie-సలార్ లో నాపై అలాంటి సీన్స్ లేవు.. కన్ఫర్మ్ చేసిన శృతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి వస్తున్న వార్తలపై తాజాగా శృతి హాసన్ స్పందించారు.ఈ సినిమాలో శృతి హాసన్ మీద కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయని వార్తలు వచ్చాయి.

కానీ అలాంటివి ఏమీ ఉండవని తాజాగా శృతి వివరించారు.
సలార్ సినిమాలో తన పాత్రకు యాక్షన్ సీన్లు ఏమీ ఉండవని.

యాక్టింగ్ పార్ట్ మాత్రమే ఉంటుందని ఆమె తెలిపింది.క్రాక్ సినిమాలో ఉండే విధంగా ఈ సినిమాలో కూడా ఉంటాయని అభిమానులు ఆశ పడ్డారు.

కానీ ఆ వార్తలలో నిజం లేదని శృతి హాసన్ చెప్పడంతో అభిమానులకు క్లారిటీ వచ్చింది.హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.

#ShrutiHaasan #Shruti Haasan #Comments #Action Scenes ##Salaar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు