పెళ్లి దాకా వచ్చి విడిపోయిన ప్రేమజంటలు ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కెమిస్ట్రీ పండించే హీరోహీరోయిన్లు చాలామంది ఉన్నారు.వీళ్లలో కొన్ని జంటలు తాము ప్రేమించుకున్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని అధికారికంగా ప్రకటించాయి.

 Heroines Affairs And Rumors  Heroines Affairs, Rumours, Shruti Haasan, Charmi, S-TeluguStop.com

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తరువాత వేర్వేరు కారణాల వల్ల విడిపోయాయి.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా పెళ్లి వరకు వచ్చి విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి.

నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్న జంటలు విడిపోతూ ఉండటంతో పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయనే మాటను బలంగా నమ్మాల్సి వస్తోంది.బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ పొడవు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.

ఈ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు కూడా వచ్చాయి.కానీ ఊహించని విధంగా అక్షయ్ ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకోగా శిల్పాశెట్టి ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

ప్రేమకథా చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు.ఉదయ్ కిరణ్ మెగా ఫ్యామిలీ అల్లుడు కాబోతున్నాడంటూ వార్తలు రావడంతో పాటు నిశ్చితార్థం కూడా జరిగింది.

అయితే ఈ పెళ్లి ఆగిపోగా సుస్మిత, ఉదయ్ తమకు నచ్చిన వేరే వ్యక్తుల్ని వివాహం చేసుకున్నారు.

ఆర్తి అగర్వాల్ తరుణ్ లవ్ గురించి వచ్చినన్ని వార్తలు ఇండస్ట్రీలో మరే హీరోయిన్ పై రాలేదు.

వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఆశించినా ఎందుకో జరగలేదు.టాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా వరుస అవకాశాలతో దూసుకెళుతున్న త్రిష వ్యాపారవేత్త, వరుణ్ మానియన్ ను ప్రేమించిందని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వీళ్లు విడిపోయారు.

ప్రభుదేవా నయనతార లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభుదేవాకు అప్పటికే పెళ్లైందని తెలిసినా నయనతార ప్రభుదేవాను ప్రేమించింది.వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

మరికొన్ని రోజుల్లో వీళ్లిద్దరి వివాహం జరగబోతుందని వార్తలు రాగా అదే సమయంలో వీళ్లు విడిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube