ఎయిర్ పోర్ట్ లో మళ్లీ అలాంటి పనులు చేస్తున్న శృతి హాసన్!

దక్షిణాది హీరోయిన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి శృతిహాసన్ తన స్నేహితుడు శంతను హజారికతో కలిసి చేసే రచ్చ ఎలా ఉంటుందో ఇది వరకే ఎన్నోసార్లు బయట పడింది.తాజాగా ఈ అమ్మడు మరోసారి తనతో కలిసి ఎయిర్ పోర్ట్ లో చేసిన చేష్టలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 Shruti Haasan And Santanu Hazarika At Mumbai Airport-TeluguStop.com

తరచూ వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.

గత కొద్ది రోజుల క్రితం మార్కెట్లో వీరి హగ్గులు,కిస్సులు వంటి సంఘటనలను మరువకముందే మరోసారి ఎయిర్ పోర్ట్ లో నానా హంగామా చేశారు.తాజాగా శృతి హాసన్ ముంబై నుంచి పలు చిత్రాల షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లేదా చెన్నై బయలుదేరినట్లు ఉంది.ఈ క్రమంలోనే ముంబైకి వీడ్కోలు పలుకుతూ ఎయిర్ పోర్టు లో ఈ జంట కెమెరాల కంటికి దొరికారు.

 Shruti Haasan And Santanu Hazarika At Mumbai Airport-ఎయిర్ పోర్ట్ లో మళ్లీ అలాంటి పనులు చేస్తున్న శృతి హాసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్స్ కోసం వివిధ రకాల ఫోజులు ఇచ్చి మరి ఫోటోలు దిగారు.ఇక శృతి హాసన్ ముంబై నుంచి బయలుదేరుతున్న సందర్భంగా శంతను హజారికకు వీడ్కోలు చెబుతూ అతనిని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టి మరి బయల్దేరారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శృతిహాసన్ శంతను హజారికపై అమితమైన ప్రేమను కురిపించింది.

ఒక అమ్మాయికి ఇంతకన్నా మంచి స్నేహితుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకడు చెప్పడం పలు విమర్శలకు కూడా దారితీస్తోంది.ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన “సలార్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

#ShrutiHaasan #ShrutiHaasan #Shruti Haasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు