కరోనాతో అస్పత్రిలో తండ్రి.. కూతుళ్లిద్దరూ క్రేజీ సెల్ఫీలతో రచ్చ?

Shruti Haasan And Akshara Haasan Enjoys With Santanu Hazarika While Kamal Haasan Suffers With Covid 19

విశ్వనటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 Shruti Haasan And Akshara Haasan Enjoys With Santanu Hazarika While Kamal Haasan Suffers With Covid 19-TeluguStop.com

ఇక కమల్ హాసన్ ఆరోగ్యం పట్ల అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ట్వీట్ చేసింది.తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని ఆమె తెలిపింది.

అయితే ఒక వైపు తండ్రి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, కమల హాసన్ కూతుళ్లిద్దరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.శృతిహాసన్ తన ప్రియుడు హజారికాతో కలిసి ముంబైలోని ఒక ఫ్లాట్ లో ఉంటుంది.

 Shruti Haasan And Akshara Haasan Enjoys With Santanu Hazarika While Kamal Haasan Suffers With Covid 19-కరోనాతో అస్పత్రిలో తండ్రి.. కూతుళ్లిద్దరూ క్రేజీ సెల్ఫీలతో రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అక్కడికి శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.అక్షర రాకతో శృతిహాసన్ ఫుల్ పార్టీ మూడ్ లోకి వెళ్లి శృతి హాసన్, అక్షర హాసన్, హజారికా ముగ్గురు కలిసి నానా హంగామా చేస్తున్నారు.

హజారికా బొమ్మలు గీసుకుంటూ తన పని తాను చేస్తుండగా, ఈ ఇద్దరు అక్క చెల్లెలు తిండి మీద దృష్టిపెట్టారు.ఆ తరువాత ముగ్గురు పక్కపక్కనే బెడ్ పై దొర్లుతూ నానా హంగామా చేశారు.

Telugu Akshara Haasan, Chennai, Corona, Kamal Hassan, Netizens, Shruthihasan-Movie

అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు అంటూ హజారికా, చెల్లెలు అక్షర హాసన్ పేర్లను ట్యాగ్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది శృతిహాసన్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక సినిమాల విషయానికొస్తే శృతిహాసన్ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నారు అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నారు.

#Netizens #Chennai #Corona #Akshara Haasan #ShruthiHasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube