ఆహా.. రెమ్యునరేషన్ విషయంలో శృతి క్లారిటీ మాములుగా లేదుగా!

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే హీరోయిన్ల కన్నా అధికమొత్తంలో హీరోలకు రెమ్యూనరేషన్ చెల్లిస్తారు.ఇలా హీరోయిన్లు వారికున్న డిమాండ్ బట్టి వారికి పారితోషికం ఇవ్వడం అనేది జరుగుతుంది.

 Shruthihassan About Remunaration, Shruthi Hasan, Tollywood, Remuneration, Gopichand Malineni-TeluguStop.com

అయితే కరోనా మొదటి దశ తర్వాత ఎంతో మంది నిర్మాతలు చాలా నష్టాలను ఎదుర్కోవటం వల్ల హీరోలు వారి రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ఎంతో మంది నిర్మాతలు కోరారు.అయితే ఈ విధానం తమిళ ఇండస్ట్రీలో అమలులోకి వచ్చిన తెలుగులో మాత్రం ఏ ఒక్క హీరో కూడా వారి రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు.

ఈ క్రమంలోనే ఈ రెమ్యూనరేషన్ విషయంపై నటి శృతిహాసన్ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.కరోనా మొదటి దశ తర్వాత ఒక నిర్మాత తన వద్దకు వచ్చి కరోనా కారణం వల్ల అందరూ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారు తను కూడా తగ్గించుకోవాలని అడిగారట.

 Shruthihassan About Remunaration, Shruthi Hasan, Tollywood, Remuneration, Gopichand Malineni-ఆహా.. రెమ్యునరేషన్ విషయంలో శృతి క్లారిటీ మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆమె నటిస్తున్న ఆ సినిమాలో హీరో మాత్రం తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు.అందుకే హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే తాను కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను అని శృతి హాసన్ చెప్పినట్లు వెల్లడించారు.

Telugu Shruthi Hasan, Tollywood-Movie

సాధారణంగా హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారు. హీరోకి చెల్లించిన రెమ్యూనరేషన్ చెల్లించమని అడగడం ఏ మాత్రం న్యాయం కాదు కనుక హీరో రెమ్యునరేషన్ తగ్గించు కోనపుడు హీరోయిన్ ను రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం సబబు కాదని శృతిహాసన్ రెమ్యునరేషన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.అయితే ఆ నిర్మాత ఎవరు? హీరో ఎవరు? అనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు.ఇక సినిమాల విషయానికి వస్తే శృతిహాసన్ ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.

అదేవిధంగా ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube