శృతిహాసన్ కొత్త బాయ్ ఫ్రెండ్ అతడేనా..?!

శృతి హాసన్ పేరు తెలియని వారు ఉండరు.ఎందుకంటే కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లో అడుగుపెట్టిన గాని తన నటనతో అందరిని కట్టి పడేసింది.

 Shruti Haasan Spotted With New Boyfriend On Mumbai Road, Shruti Haasan ,shruti H-TeluguStop.com

ఈమె ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.తరువాత తీసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో కెరీర్ గాడిన పడింది.

సక్సెస్ ‌కు దూరమైన శృతి హాసన్ కి మళ్ళీ క్రాక్ సినిమాతో ఓ మంచి హిట్ ‌ను సొంతం చేసుకున్నది.క్రాక్ విజయంతో భారీగా ఆఫర్లను దక్కించుకుంది.

అయితే ఇప్పుడు శృతి హాసన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన 35వ బర్త్‌ డే ను జరుపుకుంది.  తాజాగా తన కొత్త బాయ్ ‌ఫ్రెండ్ ‌తో కలిసి ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరాల్లో చిక్కింది.

ఇంతకీ ఆ కొత్త ప్రేమికుడు ఎవరో.ఏంటో అనే వివరాల్లోకి వెళితే.

గతంలో లండన్‌కు చెందిన మైఖేల్ ను ప్రేమించింది.దాదాపు పెళ్లి అవ్వకుండానే కాపురం చేసినంత పని చేశారు.

ఎక్కడ చుసిన ఈ జంట పేరే మారుమోగిపోయేది.వారిద్దరి వివాహం దాదాపు ఖరారు అని అనుకొనే క్రమంలో వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2019లో విడిపోయారు.

మైఖేల్‌ కోర్సలేతో విడిపోయిన తర్వాత శృతి ఒంటరిగానే ఉంది.మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత శృతి హాసన్ మళ్ళీ ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తూ ముంబైలో పలు రెస్టారెంట్లలో తిరుగుతూ అప్పట్లో ఒకసారి మీడియా కంట పడింది.

Telugu Boy Friend, Prabas, Shruti Haasan, Shrutihaasan, Sruthi Hassan-Movie

మళ్ళీ ఆ వార్తలను నిజం చేసేలాగా జనవరి 27వ తేదీన బాయ్‌ ఫ్రెండ్ ‌తో నడిరోడ్డు మీద చేతిలో చేయి వేసుకొని డేటింగ్ చేస్తూ కనిపించింది.గతంలో అదే వ్యక్తితో పలుమార్లు కనిపించినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.తాజాగా మీడియాకు చిక్కిన ఈ వీడియోలో శృతి హాసన్ జీన్స్, టీ షర్ట్ వేసుకొని మాస్క్ ధరించి రద్దీ ప్రదేశంలో ప్రియుడి చేతిని పట్టుకొని రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది.అయితే శృతి హాసం చేయి పట్టుకుని నడుస్తున్న వ్యక్తి కూడా మాస్క్ ధరించి ఉండటంతో అతడు ఎవరయ్యి ఉంటాడని అందరు ఆలోచనలో పడ్డారు.

అలాగే సినిమా విషయనికి వస్తే శృతిహాసన్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా సలార్ సినిమాలో నటించే ఆఫర్ ‌ను చేజిక్కించుకొన్నారు.ప్రస్తుతం క్రాక్ సినిమా విజయాన్ని తన ప్రియుడితో కలిసి ముంబాయి విధుల్లో ఎంజాయ్ చేస్తున్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube