Shruthi hassan walteru veerayya : గుర్తు పట్టలేని స్థితిలో హీరోయిన్ శృతి హాసన్.. లావు కావడం వల్లే అని చెబుతూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Shruthi Hassan Latest Look Viral On Social Media Shruthi Haasan, Tollywood, Walt-TeluguStop.com

చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఒక సినిమా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు చిరంజీవి.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవాలని అన్న ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా వాల్తేరు వీరయ్య సినిమాను వచ్చి ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ లోకి దిగాలని దర్శకుడు బాబీ చూస్తున్నాడు.దానిలో భగంగా చిరు శృతి హాసన్ పై డ్యూయెట్ ని విదేశాల్లో ప్లాన్ చేశారు మేకర్స్.

శృతి హాసన్ తో చిరు రెండు సాంగ్స్ కోసం యూరప్ కు బయలు దేరివెళ్ళింది.చిత్ర బృందం తో పాటు మెగాస్టార్ చిరు కూడా తన భార్య సురేఖ, తన పెద్ద కూతురు సుశ్మిత, ఆమె పిల్లలు, శ్రీజ కూతురు తో కలిసి మెగాస్టార్ చిరంజీవి యూరప్ ఫ్లైట్ ఎక్కారు.

చిరంజీవి యూరప్ షెడ్యూల్ పై అప్ డేట్ ఇస్తూ సరదాగా ఫ్యామిలీ తో అటు విహార యాత్ర, హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర #EuropeBeckons #WaltairVeerayya అంటూ భార్య, కూతురు, మానవరాళ్లతో చిరు పిక్ ని, ఫ్లైట్ లో హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి ఉన్న పిక్ ని ట్విట్టర్ లో షేర్ చేసారు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ ఫోటోలో శృతిహాసన్ లుక్స్ పై ప్రస్తుతం కామెంట్స్ వినిపిస్తున్నాయి.శృతిహాసన్ భారీగా లావు అయిందని ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరు అయితే మొదట్లో చిరంజీవి పక్కన శృతిహాసన్ ని చూసినప్పుడు సరిగ్గా గుర్తుపట్టలేకపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం శృతిహాసన్ లుక్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube