వృద్ధురాలిగా శృతి హాసన్... ఓటీటీ రిలీజ్ కాబోతున్న సినిమా

ప్రస్తుతం డిజిటల్ ట్రెండ్ లో అందాల భామలు అందరూ కూడా ఓటీటీ బాట పెట్టేస్తున్నారు.సినిమాలలో అయితే కేవలం హీరోలకి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.

 Shruti Haasan Opens Up On Playing Older Woman In Yaara, Tollywood, Bollywood, Ot-TeluguStop.com

అభిమానులని దృష్టిలో పెట్టుకొని హీరో ఇమేజ్ మీద నడిచే కథలనే దర్శకులు సిద్ధం చేస్తారు.అలాగే నిర్మాతలు కూడా అలంటి కథల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

హీరోయిన్స్ కి బిగ్ స్క్రీన్ మీద తమని తాము ఎలివేట్ చేసుకోవడానికి, తమలోని నటిని పరిచయం చేయడానికి స్కోప్ దొరకదు.అతి కొద్ది మంది భామలకి మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది.

అయితే నటిగా ప్రూవ్ చేసుకోవాలని అనుకునే వారికి ఓటీటీ బెస్ట్ ప్లాట్ ఫామ్ గా మారిపోయింది.ఒరిజినల్ కంటెంట్ తో, కేవలం కాంబినేషన్స్ కంటే స్టొరీకి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది.

స్టొరీలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.హీరో ఇమేజ్ అనేది డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో అస్సలు పనికి రాదు.

దీంతో అందాల భామలు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ బాట పడుతున్నారు.వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు తండ్రిలా విభిన్న పాత్రలతో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.అయితే సౌత్ సినిమాలో దొరకని ఆ అవకాశం ఆమెకి హిందీలో దొరికింది.ఆమె హిందీలో నటించిన డిఫరెంట్ కంటెంట్ సినిమా యారా ఓటీటీ ద్వారా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానున్నది.ఈ సినిమాలో ఆమె వృద్ధురాలిగా నటిస్తున్నట్లు శృతిహాసన్‌ తెలిపింది.ఆమె మాట్లాడుతూ 1970, 90 కాలాల వ్యవధుల్లో ఈ కథ సాగుతుంది.1990 ఎపిసోడ్స్‌లో వృద్ధురాలిగా కనిపిస్తా.వయసుకు మించిన పాత్రలు చేయడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది.వృద్ధురాలిగా నటించడం నా కెరీర్‌లో తొలిసారి కావడంతో పాత్ర విషయంలో చాలా పరిశోధన చేశా.దుస్తులు, హావభావాలు,నడక తీరుతో పాటు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా.నా సినీ ప్రయాణంలో ఎక్కువగా శ్రమించి చేసిన పాత్రల్లో ఇదొకటి.

నాలోని నటనాప్రతిభకు అసలైన పరీక్షగా నిలిచిన ఈ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాననే నమ్మకముంది అని తెలిపింది.దీంతో పాటు ఓ విభిన్న కథతో తెరకెక్కే వెబ్ సిరీస్ లో నటించడానికి శృతి హసన్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube