మానసిక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న శృతి హాసన్  

Shruti Haasan suffer from anxiety and running keeps me calm, Tollywood, Telugu Cinema, Celebrity Lifestyle - Telugu Celebrity Lifestyle, Shruti Haasan Suffer From Anxiety And Running Keeps Me Calm, Telugu Cinema, Tollywood

సెలబ్రిటీ జీవితం గడిపేవారు బయటి ప్రపంచానికి మొహం మీద చిరునవ్వుతో సంతోషంగా ఉన్నట్లు కనిపించిన, నిత్యం మానసిక సమస్యలు, ఒత్తిడితో సతమతం అవుతూ ఉంటారు.వారు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వారి జీవితాలలో కూడా కష్టాలు, బాధలు ఉంటాయి.

 Shruthi Hasan Martial Atrs Celebrity Life Style

అయితే తెరపై కనిపించిన తర్వతా వారికి ఉన్న కష్టాలు వారి మొహంలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు.అందుకే ఎంత కష్టం గుండెల్లో ఉన్న బయటికి నవ్వుతూ కనిపిస్తారు.

ఒక్కోసారి ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు.ఈ మధ్య కాలంలో అలా ఆత్మహత్యలు చేసుకుంటున్న సెలబ్రిటీలు ఇంకా ఎక్కువ మంది కనిపిస్తారు.

మానసిక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న శృతి హాసన్-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా సుశాంత్ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ జీవితంలో కూడా ఒకానొక సమయంలో మానసిక సమస్యలతో బాధపడినట్లు తెలిపారు.

తాజాగా శృతి హసన్ కూడా మానసిక సమస్యలపై క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల ఆమె తమ బాయ్ ఫ్రెండ్ కి బ్రేక్ అప్ చెప్పేసింది.ఈ సమయంలో తాను మానసిక ఆందోళన సమస్యతో బాధపడ్డాడని, నిరంతర వ్యాయామంతో దానిని అధిగమించానని తెలిపింది.

తానెప్పుడు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొంది.ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని చెప్పింది.

ఫైటింగ్‌ అంటే చాలా ఇష్టమని తన అభిరుచిని వ్యక్త పరిచింది.లాక్‌డౌన్‌ సమయంలోను ఖాళీగా ఉండటం వలన సొంతంగా పాటలు రాశానని, అలాగే వంటలు వండటం నేర్చుకున్నానని, అలాగే మాస్క్‌లను తయారు చేసినట్లు పేర్కొంది.

ఖాళీగా ఇంట్లో ఉన్న సమయంలో ఏదో ఒక పని మీద శ్రద్ధ పెడితే ఎలాంటి మానసిక సమస్యలు ఉత్పన్నమవవని ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హసన్ చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruthi Hasan Martial Atrs Celebrity Life Style Related Telugu News,Photos/Pics,Images..