ప్రభాస్ గురించి దిమ్మతిరిగే కామెంట్స్ చేసిన శృతిహాసన్..!

టాలీవుడ్ సినీ నటి శృతిహాసన్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస సినిమాల్లో బాగా బిజీ గా ఉంది.

 Shruthi Hasan About Prabhas Real Charecter In Salaar Shoot-TeluguStop.com

స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది.ఇక శృతి హాసన్ ఏ విషయాన్నైనా ముక్కు సూటి తో మాట్లాడుతుందని తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ మధ్య తరచూ వార్తల్లో కూడా నిలుస్తుంది.తాజాగా ప్రభాస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.

 Shruthi Hasan About Prabhas Real Charecter In Salaar Shoot-ప్రభాస్ గురించి దిమ్మతిరిగే కామెంట్స్ చేసిన శృతిహాసన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలినోలే లేరని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో బిజీగా ఉన్న ప్రభాస్.ప్రస్తుతం బాలీవుడ్ స్థాయి మించి సక్సెస్ ను అందుకుంటున్నాడు.ఇక ప్రభాస్ నటన విషయంలో పక్కన పెడితే.

తను వ్యక్తిగత విషయంలో ఎప్పుడు పై స్థానంలో ఉన్నానని ఎప్పుడు ఎక్కువగా ఫీల్ అవ్వడు.అందరితో ఎంతో సన్నిహితంగా ఉంటాడు ప్రభాస్.

మేకప్ మ్యాన్ నుండి ప్రతి ఒక్కరికి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు.ఈ విషయం గురించి శృతిహాసన్ తాజాగా కొన్ని విషయాలు పంచుకుంది.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఎంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ లను అనుకోవాలి చివరికి ఈ పాత్ర శృతి కే సెట్ అవుతుందని దర్శకుడు ఫిక్స్ చేశాడు.

అంతేకాకుండా ప్రభాస్ తో సినిమా అంటే కథ వినకుండానే ఫిక్స్ చేసిందంట శృతి.

ఇక తాజాగా బాలీవుడ్ వెబ్ మీడియా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.ప్రభాస్ ఎప్పుడు చిల్ ఉంటాడని తెలిపింది ఈ బ్యూటీ.ఇక ప్రభాస్ గురించి తనకు ముందే తెలిసినప్పటికీ కూడా మరీ ఇంత కూల్ గా ఉంటాడని ఎప్పుడూ ఊహించలేదట శృతి.

తను పని చేసే ప్రతి ఒక్క విషయంలో మంచి నమ్మకంతో ఉంటాడని తెలిపింది.అంతే కాకుండా అతను ఎక్కడ ఉంటే అక్కడ అంత ఎనర్జీ ఉంటుందని, చాలా ఉత్సాహంగా ఉంటాడని.

పైగా ప్రభాస్ ఏమాత్రం స్టార్ ఇమేజ్ ను చూపించడని, ఎప్పుడైనా ఒదిగే ఉంటాడని తెలిపింది.

Telugu Prabhas, Salar, Shruthi Hasan, Tollywood-Movie

అంతేకాకుండా తన లైఫ్ లో ఒదిగి ఉండే స్టార్స్ ని చాలామందినే చూసిందట.కానీ అందులో నకిలీ బిహేవ్ చేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారని, మంచిగా ప్రవర్తించి నకిలీ మనుషులను చూశానని తెలిపింది.ఇక ప్రభాస్ లో తనకు కాస్త తేడా కూడా కనిపించలేదట.

అందుకే తనని ఇష్టపడుతున్నానని, పర్సనల్ గా నే కాకుండా వర్క్ విషయంలో కూడా కూల్ గా ఉండడం లో ప్రభాస్ ఒక్కడే అని తెలిపింది.ప్రభాస్ ను చూసి చాలా నేర్చుకోవాలని, అంత రేంజ్ లో ఉన్న తన స్టార్ డమ్ చూపించుకోలేదని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

#Shruthi Hasan #Salar #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు