అమ్మ పాత్రల్లో నటిస్తా.. శృతిహాసన్ కీలక వ్యాఖ్యలు..!

వరుసగా కొన్ని సినిమాలు చేసి సంవత్సరాల తరబడి గ్యాప్ ఇస్తున్నా శృతిహాసన్ కు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.సంక్రాంతి పండుగకు శృతి నటించిన క్రాక్ సినిమా విడుదలై సక్సెస్ కాగా త్వరలో ఆమె నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా విడుదల కానుంది.

 Shruthi Haasan Sensational Comments About Mother Roles, Shruthi Haasan, Krack Mo-TeluguStop.com

వకీల్ సాబ్ సినిమాలో శృతిహాసన్ పాత్ర చిన్న పాత్రే అయినప్పటికీ కథలో ఈ పాత్రలో కీలకమని తెలుస్తోంది.క్రాక్ సినిమాలో శృతిహాసన్ ఒక పిల్లవాడికి తల్లిగా నటించారు.
శృతిహాసన్ అలాంటి పాత్రలో నటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా తాజాగా శృతిహాసన్ ఆ పాత్ర గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ తల్లి పాత్రల్లో నటించడం ఏమిటని ప్రశ్నలు ఎదురవుతూ ఉండగా ఆ ప్రశ్నల గురించి స్పందిస్తూ శృతిహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కథకు అవసరమైతే తల్లి పాత్రల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు.

Telugu Krack, Mother, Mothershruti, Sensational, Shruthi Haasan, Shruthihaasan,

తల్లి పాత్రల్లో నటిస్తే హీరోయిన్ గా అవకాశాలు రావని తాను భావించనని అన్నారు.పాత్ర కీలకంగా ఉండి కథతో సంబంధం ఉంటే అమ్మపాత్రల్లో నటించడానికి కచ్చితంగా అంగీకరిస్తానని అందులో సందేహం అవసరం లేదని పేర్కొన్నారు.అమ్మ పాత్రల విషయంలో వెనుకడుగు వేయనని తెలిపారు.

శృతిహాసన్ ధీటుగా ఇచ్చిన సమాధానంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని రకాల పాత్రల్లో నటిస్తేనే హీరోయిన్లకు గుర్తింపు వస్తుందని ఒకే తరహా పాత్రల్లో నటించడం వల్ల ఎటువంటి లాభం ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మిగతా హీరోయిన్లు తల్లి పాత్రల్లో నటిస్తే అవకాశాలు తగ్గుతాయని భావిస్తూ ఉండగా శృతి హాసన్ వారికి భిన్నంగా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం.తెలుగుతో పాటు శృతిహాసన్ తమిళం, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నారు.2017 సంవత్సరం తరువాత శృతిహాసన్ రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ వరుస అవకాశాలతో బిజీ కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube