ఆంటీ పాత్రలో ముద్దుగుమ్మ

తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా కొంత కాలం పాటు వెలుగు వెలిగిన శ్రియకు ప్రస్తుతం ఆఫర్లు లేవు.అవకాశాలు లేని హీరోయిన్‌లు ఐటెం సాంగ్స్‌కు లేక, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా చేసేందుకు సిద్దం అవుతారు.

 Shriya Saran In Drishyam Remake-TeluguStop.com

అయితే శ్రియ ఇన్నిరోజులుగా అలాంటి పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది.కాని తాజాగా ఈమెకు బాలీవుడ్‌లో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

అయితే ఆ సినిమాలో ఆంటీగా నటించాల్సి ఉంది.అవకాశాలు లేని సమయంలో వచ్చిన ఆ సినిమాను వదులుకోవడం ఇష్టం లేని శ్రియ ఆంటీ పాత్రకు కూడా సై అంటూ సైన్‌ చేసింది.

బాలీవుడ్‌లో అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా ‘దృశ్యం’ రీమేక్‌ తెరకెక్కబోతుంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయ్యింది.త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత అవకాశం దక్కించుకున్న శ్రియ మళ్లీ జోరును పెంచుతుందా లేక ఈ సినిమాతో ఈ అమ్మడి కెరీర్‌కు బ్రేక్‌ పడనుందో చూడాలి.ఈ సినిమా తర్వాత శ్రియకు ఆంటీగా, అక్కగా పాత్రలు దక్కే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

శ్రియ ఓకే అంటే తెలుగులో ఈమెకు సహాయ నటి పాత్రల్లో అవకాశాలిచ్చే వారు చాలా మందే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube