మరో సీనియర్ హీరోకు సై అంటోన్న బ్యూటీ  

Shriya Saran Signs Rajasekhar Movie - Telugu Balakrishna, Rajasekhar, Shriya Saran, Telugu Movie News

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ శ్రియా సరన్, ఆ తరువాత కెరీర్‌లో ఫేడవుట్ పాత్రలు చేస్తూ వచ్చింది.అటుపై పెళ్లి చేసుకుని కొంతకాలంగా సినిమాలు బాగా తగ్గించేసింది.

Shriya Saran Signs Rajasekhar Movie - Telugu Balakrishna News

వచ్చిన ఆఫర్లను మాత్రం చేసుకుంటూ అడపాదడపా ప్రేక్షకులను అలరిస్తున్న శ్రియా, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో జోరు పెంచేసింది.

ఇప్పటికే ఈ బ్యూటీ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక పాత్రలో నటిస్తుందనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

కాగా తాజాగా స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో శ్రియ నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో చాలా మందిని అనుకున్నప్పటికీ శ్రియా అయితేనే బాలయ్యకు కరెక్ట్ అని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట.

ఇక మరో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తు్న్నాడు.

వీరభద్రమ్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ చాలా వైవిధ్యమైన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రియాను ఓకే చేశారట చిత్ర యూనిట్.దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకీ తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తాజా వార్తలు

Shriya Saran Signs Rajasekhar Movie-rajasekhar,shriya Saran,telugu Movie News Related....