శ్రీయాతో బర్త్ డే బేబీ.. ఆకర్షిస్తున్న ఫోటోలు..

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో శ్రీయా శరన్ ఒకరు.ఈమె దాదాపు టాలీవుడ్ ప్రముఖ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

 Shriya Saran Shares Adorable Moments With Her Cute Daughter,  Shriya,  Shriya An-TeluguStop.com

శ్రీయా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా రాణిస్తుంది.శ్రీయ వయసు నాలుగు పదులకు చేరువ అవుతున్న కూడా ఆమె అందం రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

ఇప్పటికి తన అందంతో కుర్రకారును చూపు తిప్పుకో లేకుండా చేస్తుంది.ప్రస్తుతం శ్రీయ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కనిపించ బోతుంది.

ఇందులో అజయ్ దేవగణ్ సరసన ఈమె కనిపిస్తుంది.అయితే తాజాగా శ్రీయ కొన్ని వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోలను షేర్ చేస్తూ తన సీక్రెట్ కు ఏడాది పూర్తి అయినట్టు శ్రీయ తెలిపింది.

ఈమె లాక్ డౌన్ లో భర్తతో పాటు విదేశాల్లో గడిపిన తర్వాత ఒకరోజు మీడియా ముందుకు కూతురు తో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.లాక్ డౌన్ లోనే పాప పుట్టినట్టు మరొక వీడియో ద్వారా తెలిపింది.బిడ్డ పుట్టే వరకు ఈమె ఈ విషయాన్నీ సీక్రెట్ గా ఉంచింది.

తాజాగా శ్రీయ తన పాపకు ఏడాది పూర్తి అయినట్టు తెలుపుతూ తన బిడ్డతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో, వీడియోల్లో శ్రీయ తన కూతురుతో ఆనందంగా గడుపుతున్నట్టు కనిపించింది.”మీరు ఇంకా ఆమెను కలవలేదు.ఆమెకు మీ ప్రేమను అందించండి.

ఆమె ప్రతి చోట స్నేహితులను, ప్రేమను పొందాలని అదృష్టం, ఆనందం ఆమె ఉత్తమ స్నేహితులు కావాలని నేను ప్రార్ధిస్తున్నాను” అంటూ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా విషేష్ అందించింది.ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెటిజెన్స్ ను ఆకట్టు కుంటున్నాయి.

ఈమె షేర్ చేసిన కొద్దీ సేపటికే నెట్టింట వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube