ఆర్ఆర్ఆర్ లో తన పాత్ర గురించి రివీల్ చేసిన శ్రియ శరణ్

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని ఏకంగా పదేళ్ళ పాటు తన హవా కొనసాగించిన భామ శ్రియ శరణ్.కెరియర్ ముగిసే దశలో హ్యాపీగా పెళ్లి చేసుకొని తన భర్తతో కలిసి విదేశాలలో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సినిమాలలో స్పెషల్ పాత్రలతో మెరుస్తుంది.

 Shriya Saran Open Up Hero Role In Rrr Movie, Tollywood, Telugu Cinema, Rrr Movie-TeluguStop.com

ఆ మధ్య ఓ చిన్న సినిమాలో కనిపించిన శ్రియ ఇప్పుడు ఏకంగా రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ లో స్థానం సొంతం చేసుకుంది.చాలా కాలంగా శ్రియ ఆర్ఆర్ఆర్ లో నటిస్తుంది అనే వార్తలు వినిపిస్తూ వస్తున్నా దీనిపై చిత్ర యూనిట్ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇక భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇందులో కాస్టింగ్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం క్వారంటైన్ లో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న శ్రియ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఎక్కువగా ముచ్చటిస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తూ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించింది.ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కి జోడీగా కనిపించబోతున్నానని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగణ్, శ్రియ ఎపిసోడ్ ప్లాష్ బ్యాక్ లో వస్తుందని రివీల్ చేసింది.ఆమె చెప్పినదానిని బట్టి అందరూ అనుకుంటున్నట్లు అజయ్ దేవగన్ చేస్తున్నది ఇందులో నెగిటివ్ రోల్ కాదని, హీరోలతో సమానమైన పాత్రనే అని తెలుస్తుంది.

మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో అనేది రాజమౌళి క్లారిటీ ఇచ్చేంత వరకు సస్పెన్స్ గానే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube