స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.సమంత తన వ్యాధి గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
అలా ఉంటూనే యశోద సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నది సమంత.ఇక సమంత వ్యాధి గురించి సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ స్పందించింది.
రీసెంట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయ సమంత చాలా మంచి వ్యక్తి అని.చాలా స్ట్రాంగ్ గర్ల్.ఆమె జీవితంలో ఇది ఒక చిన్న దశ మాత్రమే అని అన్నారు.సమంత ఈ వ్యాధిని ఎదురించి స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇస్తుందని అన్నారు శ్రీయ.
సమంత ఆరోగ్యవంతంగా తిరిగి కోలుకుంటుందని అన్నారు శ్రీయ.శ్రీయ మాత్రమే కాదు సమంత అనారోగ్యం గురించి చాలామంది హీరోయిన్స్ తమ సోషల్ మీడియాలో స్పందించారు.
అందరు కూడా సమంత త్వరగా కోలుకోవాలని అన్నారు.తను బెడ్ మీద ఉండి కూడా సమంత యశోద సినిమాతో హిట్ అందుకుంది.
త్వరలో సమంత శాకుంతలం సినిమాతో రాబోతుంది.గుణశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ భారీ బడ్జెట్ తో వస్తుంది.
సమంత మాత్రం ఆరోగ్యం బాగాలేకపోయినా తన రాబోతున్న సినిమాల గురించి హాస్పిటల్ లో కూడా డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.